Begin typing your search above and press return to search.

ట్రంప్ నకు ఎదురుదెబ్బ.. భారీ పరిహారం చెల్లించాల్సిందేనన్న కోర్టు

అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణ అప్పట్లో పెను సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   1 Jan 2025 10:34 AM GMT
ట్రంప్ నకు ఎదురుదెబ్బ.. భారీ పరిహారం చెల్లించాల్సిందేనన్న కోర్టు
X

అగ్ర రాజ్యమని ఊరికే అనరు. మరికొద్ది వారాల్లో అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎంత పవర్ ఫుల్ అన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి తప్పు చేసినట్లు రుజువైతే.. దానికి శిక్షను విధించేందుకు అక్కడి కోర్టులు వెనుకాడవన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుంది. అదే వేరే దేశాల్లో అయితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇంతకూ ఏం జరిగిందంటే..

అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణ అప్పట్లో పెను సంచలనంగా మారింది. ట్రంప్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఇదంతా 1990ల్లో జరిగినట్లుగా ఆమె వెల్లడించటం పెను సంచలనానికి కారణమైంది. ఈ ఆరోపణలపై జరిగిన న్యాయపోరాటంలో న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టు గతంలో తీర్పును ఇచ్చింది.

తనపై అత్యాచారం జరిగిందన్న ఆమె ఆరోపణలతో జ్యూరీ ఏకీభవించలేదు. అయితే.. ఆమెపై లైంగిక వేధింపులకు ట్రంప్ బాధ్యుడేనని మాత్రం కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో ఆమెకు ట్రంప్ 5 మిలియన్ డాలర్ల ( మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ41 కోట్లుగా చెప్పొచ్చు) పరిహారం చెల్లించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాల్ని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టటానికి కాస్త ముందుగా ట్రంప్ నకు తగిలిన ఎదురుదెబ్బగా దీన్ని చెప్పాలి.

ఇదిలా ఉండగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ విడుదల చేసిన వీడియో అందరిని ఆకర్షిస్తోంది. తమ దేశానికి శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరన్న ఆయన.. అమెకాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తమవైపే ఉన్నట్లుగా పేర్కొన్నారు. శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరని తమకు తెలుసన్న ఆయన.. 34 నెలలుగా రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకోవటంలో అమెరికా తమవైపే ఉన్నట్లు తాను బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడును ట్రంప్ ఆపుతారనటంలో తమకు ఎలాంటి సందేహం లేదన్న ఆయన ఇరుపక్షాలను శాంతపర్చటానికి ఇది వీధి గొడవ కాదన్న జెలెన్ స్కీ.. ‘ఈ రోజు రష్యా మీకు షేక్ హ్యాండ్ ఇస్తే రేపు చంపదన్న గ్యారెంటీ లేదు. రష్యన్లకు స్వేచ్చ స్వేచ్ఛగా ఉండేవారంటే భయం. కొత్త సంవత్సరంలో ఉక్రెయిన్ ను బలంగా ఉంచటానికి అందరం కలిసి పోరాడాలి’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలకు ట్రంప్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.