Begin typing your search above and press return to search.

మహిళా కానిస్టేబుల్.. ఇప్పుడు తండ్రి అయ్యాడు.. అదెలానంటే?

దీంతో ఆమె వైద్యుల్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆమెను లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలన్న సూచనను చేశారు. దీంతో ఆమె.. మూడుసార్లు శస్త్ర చికిత్సలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 6:35 AM GMT
మహిళా కానిస్టేబుల్.. ఇప్పుడు తండ్రి అయ్యాడు.. అదెలానంటే?
X

రోజులు మారాయి. పాతికేళ్ల క్రితం కలలో కూడా ఊహించని ఎన్నో పరిణామాలు ఇప్పుడు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతాలు ఇప్పుడు తరచూ ఎదురవుతున్న పరిస్థితి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఉదంతమే బయటకు వచ్చి ఆసక్తికరంగా మారింది. ఒక మహిళా కానిస్టేబుల్ పురుషుడిగా మారటమే కాదు.. తాజాగా తండ్రి అయ్యాడు. ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..

1988లో పుట్టిన లలిత 2010లో మహిళా కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. అయితే.. ఆమె తన శరీరంలో వస్తున్న మార్పుల్ని 2013లో గుర్తించారు. దీంతో ఆమె వైద్యుల్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆమెను లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలన్న సూచనను చేశారు. దీంతో ఆమె.. మూడుసార్లు శస్త్ర చికిత్సలు చేశారు.

2018-2020 మధ్య కాలంలో మూడుసార్లు శస్త్ర చికిత్సలు పూర్తి చేసుకున్న అనంతరం తన పేరును లలిత్ గా మార్చుకుననారు. అనంతరం 2020లో సీమా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరికి పండంటి బాబుకు తండ్రి అయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవటంతో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.