బిగ్ బ్రేకింగ్... ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ!
ఇందులో భాగంగా... సోమవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు తమ ముందు హాజరుపరచాలని ఏసీబీ కోర్టు పేర్కొంది.
By: Tupaki Desk | 12 Oct 2023 12:01 PM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బిగ్ షాక్ తగిలిందనే అనుకోవాలి. ఇందులో భాగంగా... ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో... సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశించింది.
అవును... గత నెలరోజులుకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటూ... కుటుంబ సభ్యులను మాత్రమే కలుస్తున్న చంద్రబాబు సోమవారం బయట ప్రపంచం చూడబోతున్నారు. ఇందులో భాగంగా... సోమవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు తమ ముందు హాజరుపరచాలని ఏసీబీ కోర్టు పేర్కొంది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై గురువారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో... చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ సమయంలో ఆయన వాదనలు అనంతరం పీటీ వారెంట్ కు అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో... రేపటి సుప్రీం తీర్పు వస్తే ఇంటర్వెన్ కావొచ్చని బాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది. అదేవిధంగా... సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది! ఈ కేసులో సీఐడీ తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు!
మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. అదేవిధంగా అంగళ్లు అల్లర్ల కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.
కాగా... స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్ రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుపర్చాలని న్యాయాధికారి ఆదేశించారు.
మరో వైపు చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.