Begin typing your search above and press return to search.

పాస్ పోర్టు కోసం గొడ‌వ‌.. ప్రాణ‌లు తీసింది.. కేర‌ళ న‌ర్సుకు ఈ నెల‌లోనే ఉరి శిక్ష‌

అయితే.. ఈ న‌ర్సు చేసిన ఘోరం ఏంటంటే.. త‌న పాస్ పోర్టు విష‌యంపై జ‌రిగిన వివాదంలో యెమ‌న్ పౌరుడికి మ‌త్తు మందు ఇంజెక్ష‌న్ చేసి.. ప్రాణాలు తీయ‌డ‌మే.

By:  Tupaki Desk   |   28 Nov 2023 2:45 AM GMT
పాస్ పోర్టు కోసం గొడ‌వ‌.. ప్రాణ‌లు తీసింది.. కేర‌ళ న‌ర్సుకు ఈ నెల‌లోనే ఉరి శిక్ష‌
X

న్యాయ వ్య‌వ‌స్థ‌.. అన్ని దేశాల్లోనూ ఒకే విధంగా ఉండ‌దు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానం అవలంబి స్తారు. ముఖ్యంగా దుబాయ్‌, యెమ‌న్ వంటి అర‌బ్ కంట్రీల్లో దాదాపు స్పాట్ జ‌స్టిస్ జ‌రిగిపోతుంది. కేవ‌లం మూడు మాసాల వ్య‌వ‌ధిలోనే బాధితుల‌కు న్యాయం.. దోషుల‌కు శిక్ష‌లు అమ‌లు జ‌రుగుతుంటాయి. ఇలా.. ఇప్పుడు కేర‌ళ‌కు చెందిన ఓ న‌ర్సును(30) ఈ నెల‌లో యెమ‌న్ ప్ర‌భుత్వం ఉరితీయ‌నుంది. దీనికి సంబం ధించి డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది.

ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఈ న‌ర్సు చేసిన ఘోరం ఏంటంటే.. త‌న పాస్ పోర్టు విష‌యంపై జ‌రిగిన వివాదంలో యెమ‌న్ పౌరుడికి మ‌త్తు మందు ఇంజెక్ష‌న్ చేసి.. ప్రాణాలు తీయ‌డ‌మే. దీనిని కేవ‌లం వారం రోజుల్లోనే నిర్ధారించిన న్యాయ‌స్థానం.. ఆమెకు మ‌ర‌ణ శిక్ష‌(ఉరి) విధించింది. దీనిని అమ‌లు చేయ‌కుండా ఆపాల‌న్న ప్ర‌యత్నాలు.. జ‌రిగినా.. అవి కూడా ఫ‌లించ‌లేదు. దీంతో ఈ నెల‌లోనే ఉరేయాల‌ని సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రించింది.

ఏం జ‌రిగింది?

కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే నర్సు 2015లో యెమ‌న్‌కు వెళ్లి ఉపాధి ద‌క్కించుకుంది. అక్క‌డి ప్ర‌ముఖ వైద్య శాల‌లో న‌ర్సుగా స్థిర‌ప‌డింది. అయితే.. క‌ర‌ళ‌లోనే సొంత‌గా క్లినిక్ ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంతో ఆమె తిరిగి భార‌త్‌కు రావాల‌ని అనుకుంది. అయితే.. ఈ క్ర‌మంలో తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ జాతీయుడి నుంచి తన పాస్‌పోర్ట్‌ ను తిరిగి తీసుకునే క్రమంలో జరిగిన గొడవలో అతనికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ప్రాణాలు తీసింది.

దీనిపై కేసు న‌మోదు చేసిన యెమ‌న్ పోలీసులు.. ప‌ది హేను రోజుల్లోనే నిందితురాలిని కోర్టుకు అప్ప‌గించారు. ఆ వెంట‌నే ఆమెకు అప్ప‌ట్లోనే మ‌ర‌ణ శిక్ష ప‌డింది. ఇక‌, 2017 నుంచి న‌ర్సు ప్రియ‌ జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇక‌, 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా.. ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. అయితే.. తాజాగా ఆమె మరణశిక్ష అప్పీల్‌ను యెమెన్ కోర్టు మరోసారి తిరస్కరించింది.

అంతేకాదు.. ఈ నెల‌లోనే ఉరేయాల‌ని ఆదేశించింది. దీంతో కేర‌ళ‌లోని ఆమె త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. హ‌తుడి కుటుంబంతో మాట్లాడి ప‌రిహారం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కానీ, యెమ‌న్ వెళ్లేందుకు భార‌త్ అంగీక‌రించ‌డం లేదు. కొన్ని కార‌ణాల‌తో యెమ‌న్‌కు ప్ర‌యాణాల‌ను భార‌త్ నిషేధించింది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.