Begin typing your search above and press return to search.

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ... సామాన్య కార్యకర్తలకు పెద్దపీట!

ఈ విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Sep 2024 8:44 AM GMT
ఏపీలో నామినేటెడ్  పోస్టుల భర్తీ... సామాన్య కార్యకర్తలకు పెద్దపీట!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అందరి దృష్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగ రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఈ విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును.. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ సందర్భంగా 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ను ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. ఈ జాబితాలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యత కల్పించారు.

ప్రధానంగా ఈ జాబితాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 11 మంది క్లస్టర్ ఇన్ ఛార్జ్ లకు పదవులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఓ క్లస్టర్ ఇన్ ఛార్జ్ ని ఛైర్మన్ చేసింది. ఇదే సమయంలో ఆరుగురు యూనిట్ ఇన్ ఛార్జ్ లకూ పదవులు ఇచ్చింది.

ఇదే సమయంలో ప్రకటించిన పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రధానంగా... పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయానికి చంద్రబాబు పెద్దపీట వేశారని అంటున్నారు పరిశీలకులు.

ఈ జాబితాలో ఆర్టీసీ ఛైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ప్రభుత్వం నియమించింది. ఇదే సమయంలో వక్ఫ్ బోడు ఛైర్మన్ గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ గా లంకా దినకర్, శాప్ ఛైర్మన్ గా రవి నాయుడిని ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా పలు కార్పొరేషన్లకు ప్రకటించిన ఛైర్మన్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం..!

వక్ఫ్ బోర్డ్ - అబ్దుల్ అజీజ్ (టీడీపీ)

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) - ఏ రవినాయుడు (టీడీపీ)

ఏపీ హౌసింగ్ బోర్డ్ - బత్తుల తాతయ్య బాబు (టీడీపీ)

ఏపీ ట్రైకార్ - బోరగం శ్రీనివాసులు (టీడీపీ)

ఏపీ మారిటైం బోర్డ్ - దామచర్ల సత్య (టీడీపీ)

సీడాప్ – దీపక్ రెడ్డి (టీడీపీ)

20 సూత్రాల అమలు కమిటీ - లంకా దినకర్ (బీజేపీ)

మార్క్ ఫెడ్ - కర్రోతు బంగార్రాజు (టీడీపీ)

సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)

ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ - మంతెన రామరాజు

పద్మశాలి కార్పొరేషన్ - నందం అబద్ధయ్య (టీడీపీ)

ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ - నూకసాని బాలాజీ (టీడీపీ)

ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్- కొనకళ్ల నారాయణ (టీడీపీ)

ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్ - పీఎస్ మునిరత్నం (టీడీపీ)

పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కాపొరేషన్ - పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)

లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ - పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)

ఏపీ స్టేట్ వినియోగదారుల రక్షణ కౌన్సిల్ - పీతల సుజాత (టీడీపీ)

ఎం.ఎస్.ఎం.ఈ.డీ.సీ. - తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)

పౌరసరఫరాల కార్పొరేషన్ - తోట మొహర్ సీతారాం సుధీర్ (జనసేన)

ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ - వజ్జ బాబూరావు (టీడీపీ)

ఏపీ టిడ్కో - వేములపాటి అజయ్ కుమార్ (జనసేన)