Begin typing your search above and press return to search.

ఖతార్ ఎయిర్ వేస్.. ఇండిగోలకు ఫైన్ వేసిన కోర్టు

2022 జులై 30న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఖతార్ రాజధాని దోహా మీదుగా హైదరాబాద్ కు వచ్చారు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 4:59 AM GMT
ఖతార్ ఎయిర్ వేస్.. ఇండిగోలకు ఫైన్ వేసిన కోర్టు
X

ప్రయాణికుల లగేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖతార్ ఎయిర్ వేస్ తోపాటు ఇండిగో (గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్)కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ 2 ఫైన్ విధించింది. నిర్లక్ష్యానికి బాధ్యత వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యానికి రూ.3,12,412 మొత్తాన్ని తొమ్మిది శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని.. మానసిక వేదనకు పరిహారంగా రూ.50వేలు.. కేసు ఖర్చుల కోసం మరో రూ.50వేల మొత్తాన్ని చెల్లించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్ టి.శ్రీరంగారావు అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చే క్రమంలో ఖతార్ ఎయిర్ వేస్.. ఇండిగో విమానాల్లో ప్రయాణించారు. 2022 జులై 30న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఖతార్ రాజధాని దోహా మీదుగా హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో తన సామాగ్రిలోని ఒక బ్యాగ్ మిస్ అయ్యిందన్న విషయాన్ని గుర్తించారు. దీనిపై ఈ రెండు ఎయిర్ లైన్స్ కస్టమర్ కేర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ చేసి నెల అవుతున్నా బ్యాగు జాడ లేకుండా పోయింది. దీంతో.. మానిటరీ కంపెన్సేషన్ కింద రూ.41,650 క్లయింట్ ఖాతాలోకి జమ చేసినట్లుగాపేర్కొంది.

దీనిపై అసంత్రప్తిని వ్యక్తం చేసిన ఫిర్యాదీ వినియోగదారుల కమిషన్ లో కంప్లైంట్ చేశారు. ఫ్లైట్ ఎక్కే వేళలో తన లగేజీని జాగ్రత్తగా ఉండాలని.. విలువైన వస్తువులు ఉన్నట్లుగా చెప్పినప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఇరు వర్గాల వాదనలు.. సాక్ష్యాల్ని పరిశీలించిన కమిషన్ కంప్లైంట్ చేసిన వారి వాదనతో ఏకీభవించారు. పోయిన బ్యాగు విలువ రూ.3,54,062లో అప్పటికే ఎయిర్ లైన్స్ చెల్లించిన రూ.41,650 మినహాయించుకొని మిగిలిన మొత్తాల్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.