Begin typing your search above and press return to search.

పాండాల దెబ్బకు కు బెంబేలెత్తిపోయిన ఫిన్లాండ్ జూ..

ప్రభుత్వం నుంచి కూడా ఈ సదరు కంపెనీకి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో పాండాలను తిరిగి ఇచ్చేయడానికి వీరు నిర్ణయించుకున్నారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 8:30 PM GMT
పాండాల దెబ్బకు కు బెంబేలెత్తిపోయిన ఫిన్లాండ్ జూ..
X

పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే జంతువు పాండా. దీని పుట్టిల్లు చైనా అయినప్పటికీ.. పాండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే పాండాలను జాతీయ సంపదగా భావించే చైనీస్.. ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం వీటిని విదేశాలకు గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారు. అలా ఫిన్లాండ్ కు కూడా చైనా నుంచి దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం రెండు పాండాలు బహుమతి రూపంలో వచ్చాయి.

అయితే పాండాలు చూడడానికి మాత్రమే క్యూట్ గా ఉంటాయి. వాటిని భరించాలి అంటే ఖర్చు భారీగా పెట్టాలి. వీటి నిర్వహణ ఖర్చు కోట్ల రూపాయలు ఉండడంతో పాపం ఫిన్లాండ్ బెంబేలెత్తిపోయింది. మీ పాండాలు మాకొద్దు బాబోయ్ అంటూ ఇప్పుడు వాటిని తిరిగి చెయ్ నాకు ఇచ్చేస్తోంది. 2018లో షీ జిన్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫిన్లాండ్ పర్యటించారు. ఆ సందర్భంలో ఈ పాండాల సంరక్షణ మీరు దేశాల మధ్య ఒప్పంద రూపంలో జరిగింది. అందుకే

లూమీ, పిరీ అనే రెండు పాండాలను ఫిన్లాండ్ ప్రైవేట్ జూకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం ఈ జూలో ఈ రెండు పాండాలు 15 సంవత్సరాల పాటు ఉండాలి.

పాండాలు నివాసానికి అనుకూలమైన వాతావరణంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించడానికి ఇప్పటివరకు ఆ సదరు కంపెనీ సుమారు 8 మిలియన్ల యూరోలు.. అంటే మన కరెన్సీలో 74 కోట్లు వెచ్చించింది. ఇది కాక అదనంగా ప్రతి సంవత్సరానికి 1.5 మిలియన్ యూరోలు కూడా ఖర్చవుతున్నాయి.నిజానికి ఈ పాండాలు జూలో ఉండడం వల్ల పర్యాటకులు ఎక్కువ రావాల్సింది…కానీ సరిగ్గా అవి వచ్చే టైంకి కోవిడ్ రావడంతో జూకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పర్యాటకులు రాలేదు సరి కదా అప్పులు పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో పాండాల నిర్వహణ ఆ కంపెనీకి పెను భారంగా మారింది. ప్రభుత్వం నుంచి కూడా ఈ సదరు కంపెనీకి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో పాండాలను తిరిగి ఇచ్చేయడానికి వీరు నిర్ణయించుకున్నారు. అయితే గత మూడేళ్లుగా ఈ విషయంపై చైనాతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా ఎప్పటికీ ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదరడంతో మరికొద్ది రోజుల్లో పాండాలు తిరిగి చైనాకి వెళ్ళిపోతున్నాయి. అయితే దీనివల్ల తమ మధ్య ఉన్న సత్సంబంధాలకు ఎటువంటి ఇబ్బంది కలగదని రెండు దేశాలు చెబుతున్నాయి.