Begin typing your search above and press return to search.

పోలీసులు చెప్పిన పని చేసిన మోహన్ బాబు... సీపీ కీలక వ్యాఖ్యలు

మరోపక్క మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం, అందిన ఫిర్యాదులు, నమోదైన కేసులు, తాజాగా మోహన్ బాబు తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కలవడం హాట్ టాపిక్ గా మరిన వేళ.

By:  Tupaki Desk   |   16 Dec 2024 8:26 AM GMT
పోలీసులు చెప్పిన పని చేసిన మోహన్  బాబు... సీపీ కీలక వ్యాఖ్యలు
X

సుమారు గత వారం రోజులుగా మోహన్ బాబు ఇంటి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నో ట్విస్టులు, ఎన్నో కీలక పరిణామాలు.. దాడులు, కేసులు, క్షమాపణలు వెరసి అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఆదేశించగా.. వాటిని మోహన్ బాబు ఆచరించారు!

అవును... మంచు ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ప్రాణహాని ఉందంటూ అటు మనోజ్, ఇటు మోహన్ బాబు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో... పోలీసులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా.. వారి లైసెన్స్డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశించారు.

ఈ సమయంలో... మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ ను సరెండర్ చేశారు. ఇందులో భాగంగా... తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్ ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు.

మరోవైపు జల్ పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు తాజాగా మరోసారి స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తను ఉద్దేశ్యపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని చెప్పారు. ఈ సందర్భంగా... ఆదివారం సాయంత్రం యశోద ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న జర్నలిస్టును పరామర్శించి, క్షమాపణలు చెప్పారు.

కాగా... మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో విష్ణు తన అనుచరులు రాజ్, కిరణ్, విజయ్ లతోపాటు మరి కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడని.. ఆ సమయంలో జనరేటర్లో షుగర్ పోయించాడని.. దాని వల్ల రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. తామంతా ఆందోళనకు గురయ్యామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే!

రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు!:

మరోపక్క మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం, అందిన ఫిర్యాదులు, నమోదైన కేసులు, తాజాగా మోహన్ బాబు తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కలవడం హాట్ టాపిక్ గా మరిన వేళ.. రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా... మంచు ఫ్యామిలీపై ఇప్పటివరకూ మూడు ఎఫ్.ఐ.ఆర్. లు నమోదయ్యాయని తెలిపారు.

ఈ సందర్భంగా... మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం ఏమీ లేదని .. కోర్టు సమయం ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము మోహన్ బాబుకు మళ్లీ నోటీసు ఇస్తామని.. అప్పుడు ఆయన హాజరవ్వాల్సి ఉంటుందని.. అప్పటికీ సమయం కావాలంటే తమకు తెలియజేయాలని.. ఈ మేరకు బీ.ఎన్.ఎస్. 126 ప్రొవిజన్ ఉందని తెలిపారు.

ఇదే సమయంలో మెరిట్స్ ని బట్టి వారెంట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుందని సీపీ వెల్లడించారు. ఇక.. హత్యాయత్నం కేసుకు సంబంధించి ఫిర్యాదు దారుని మోహన్ బాబు వ్యక్తిగతంగా కలిశారని.. దీనికి సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అనుమతి తీసుకోలేదని తెలిపారు.

మోహన్ బాబు బౌన్సర్లపై పోలీసుల చర్యలు!:

ఇదే సమయంలో.. మంచు ఫామిలీ వ్యవహరంలో బౌన్సర్ల వ్యవహరం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జల్ పల్లి నివాసం వద్ద మనోజ్ తరుపున 30 మంది బౌన్సర్లు ఉన్నారంటే.. విష్ణు తరుపున 40 మంది వరకూ బౌన్సర్లు ఉన్నారని చర్చ హల్ చల్ చేసింది. ఇదే సమయంలో.. ఎంబీ యూనివర్శిటీ వద్ద కూడా బౌనర్లు గీత తాటి ప్రవర్తించారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇందులో భాగంగా... ఈ నెల 9న మోహన్ బాబు యూనివర్శిటీకి న్యూస్ కవరేజ్ కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఈ దాడిలో రిపోర్టర్ ఉమాశంకర్ తో పాటు కెమెరామెన్ నరసింహులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. పీఅర్వో సతీష్ తో పాటు మరికొందరిపై పోలీసులకు ఉమాశంకర్ ఫిర్యాదు చేశారు.

దీంతో.. పీఆర్వో సతీష్ తో పాటు మరో ఏడుగురు బౌన్సర్లకు సెక్షన్ 41ఏ కింద తిరుపతి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.