Begin typing your search above and press return to search.

జగన్ ఇంటివద్ద అగ్ని ప్రమాదం... టీడీపీ సంచలన పోస్ట్!

ఈ సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ నుంచి వచ్చిన ట్వీట్ సంచలనంగా మరింది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 8:00 AM GMT
జగన్  ఇంటివద్ద అగ్ని ప్రమాదం... టీడీపీ సంచలన పోస్ట్!
X

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం సంచలనంగా మారింది. దీనిపై అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి రెండు విభిన్నమైన, సంచలన వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ నుంచి వచ్చిన ట్వీట్ సంచలనంగా మరింది.

అవును... బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రాసుకొచ్చింది.

అయితే.. దీనిపై స్పందించిన టీడీపీ.. "ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏమిటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?" అని ప్రశ్నించింది.

ఇదే సమయంలో... "నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.ఒ నా? ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.." అని పోస్ట్ చేసింది.

కాగా... ఈ ఘటనపై స్పందించిన వైసీపీ... వైఎస్ జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం జరిగిందని.. సాయంత్రం, రాత్రి మంటలు ఎగసిపడ్డాయని.. దీంతో.. వైఎస్ జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని రాసుకొచ్చింది.

కాగా... గత ప్రభుత్వ హాయమలో ఏపీలోని లిక్కర్ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించిన వేళ.. తాజాగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో మరో ఆరుగురు సభ్యులతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందన్ని (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో... ఈ సిట్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి తనిఖీ చేసే అవకాశం ఉందని ముందే ఊహించి.. ఆ లెక్కలకు సంబంధించిన కాగితాలు, డైరీలు తగలబెట్టారా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది.