ముహూర్తం చూసుకుంటున్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ.. రీజనేంటి ..!
ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు వైసీపీకి రిజైన్ చేసేందుకు రెడీ అయినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 31 Dec 2024 8:30 AM GMTఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు వైసీపీకి రిజైన్ చేసేందుకు రెడీ అయినట్టు తెలిసింది. తెలియడమే కాదు.. దాదాపు ఆయన ఇంటి వద్ద.. కార్యాలయం వద్ద కూడా.. పార్టీ జెండాలు తగ్గిపోయాయని కూడా స్థానికంగా చర్చ సాగుతోంది. గతంలో ఇండిపెండెంటుగా గెలిచిన ఈయనకు ఫైర్ బ్రాండ్ ముద్ర పడింది. తర్వాత.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రిపదవిని ఆశించారు. కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనకు మంచి హవానే ఉంది.
అయితే.. చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో అలిగి.. దూరంగా ఉన్నారు. 2019 ఎన్ని కల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వోడిపోయారు. ఆ తర్వాత.. కొన్నాళ్లకు వైసీపీ పంచన చేరిపోయారు. దీంతో సదరు నేతకు జగన్ ఎమ్మెల్సీని ఆఫర్ చేశారు. ఐదేళ్లు బాగానే గడిచిపోయింది. కానీ, ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితి.. నెలకొంది. గతంలో ఉన్న కేసులో ఇటీవల శిక్షలు కూడా పడ్డాయి. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మరిన్ని కేసులు ఎదురు చూస్తున్నాయి. దీంతో పార్టీ మారకపోతే.. ప్రమాదమేనన్నది ఆయన భావన.
దీంతో సదరు ఫైర్‌బ్రాండ్ నాయకులు తిరిగి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. కానీ, ఓ మంత్రి ఈయన రాకను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాదాలు.. నినాదాలు కూడా పెరుగుతున్నాయి. చివరకు బలమైన నాయకుడు కావడం.. ఓ కీలక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆ వర్గంలో బలమైన హవా ఉండడంతో చంద్రబాబు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే నెల రోజులుగా సదరు ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీ నాయకుడు జగన్ గురించి మాట్లాడడమే మానేశారు.
అంతేకాదు.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇంటి ముందు నిత్యం ఎగిరే భారీ వైసీపీ జెండా కూడా.. తీసేయించారు. ఈ పరిణామాలను గమనించిన వారు.. ఇక.. మార్పు దిశగా ఫైర్ బ్రాండ్ అడుగు లు వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి తూర్పుగోదావరి ప్రజలకు సెంటిమెంటు, పట్టు ఉంటుంది కాబట్టి.. ఆ పండుగ తర్వాత.. ఏ క్షణమైనా.. ఈయన సైకిల్ ఎక్కేయడం ఖాయమని చెబుతున్నారు. దీనిపై వైసీపీలోనూ అంతర్గత చర్చలు సాగుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.