Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం... భయంతో జనం పరుగులు!

దీపావళి సీజన్ వచ్చిందంటే... పలు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటుంటాయి.

By:  Tupaki Desk   |   28 Oct 2024 5:59 AM GMT
వైరల్  వీడియో: అబిడ్స్  లో భారీ అగ్నిప్రమాదం... భయంతో జనం పరుగులు!
X

దీపావళి సీజన్ వచ్చిందంటే... పలు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటుంటాయి. ప్రతీఏటా ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకోవడంలో షాపుల యజమానులు విఫలమవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

అవును... హైదరాబాద్ లోని అబిడ్స్ పరిధిలోని ఓ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివార్తం రాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం.. ఈ మంటలు పక్కన ఉన్న హోటల్ కు కూడా వ్యాపించాయి. దీంతో.. జనం భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. సుమారు 10 వరకూ ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని అంటున్నారు. ప్రధానంగా ఆదివారం కావడంతో టపాసులు కొనేందుకు జనాలు అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఈ సమయంలో పేలుడు సంభవించడంతో జనాలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థాలనికి చెరుకున్నారు. ఈ సందర్భంగా 5 ఫైర్ ఇంజన్ ల సహాయంతో అతి కష్టంమీద మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరూ మహిళలని చెబుతున్నారు. వీరిని హుటాహుటున అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.

ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరోపక్క... టపాసుల దుకాణాలను అన్ని జాగ్రత్తలు, నిబంధనలూ పాటిస్తూ ఏర్పాటు చేయాలని అగ్నిమాపక అధికారులు ఎంత చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా కొంతమంది వ్యాపారులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

జనగమలో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 కోట్ల నష్టం!:

ఆదివారం తెల్లవారుజామున జనగామ జిల్లా కేంద్రంలోని రెండు షాపింగ్ మాల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చెసుకుంది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం వటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగా ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.