షర్మిలకు ఫస్ట్ షాక్.. ఫ్యూచర్‌లో మరిన్ని తప్పవా..!
ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ.. అందరికీ తెలిసిందే. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అనుసరిస్తున్న విధానాలను సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
By: Tupaki Desk | 31 March 2025 4:06 AMఏపీ కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ.. అందరికీ తెలిసిందే. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అనుసరిస్తున్న విధానాలను సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆమె ఏకపక్షంగా రాజకీయాలు చేస్తోందని.. వ్యక్తిగత అజెండాను ప్రజలపైనా.. పార్టీపైనా రుద్దుతోందని చెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తు న పార్టీలోనూ చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. నిజమైన నాయకురాలు అయితే.. సమస్యలు ఉన్నప్పుడు ప్రజలకు చేరువగా ఉండేదని అంటున్నారు.
ప్రస్తుతం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు ఆమె చేరువగా ఉండేదని.. ఇఫ్తా ర్ విందులు ఇచ్చి ఉండేదని చెబుతున్నారు. కానీ, ఆమె హైదరాబాద్ నుంచి కాలు బయటకు పెట్టకుం డా.. సొంత పెత్తనం, సొంత రాజకీయాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినా.. షర్మిల ఎవరినీ లెక్కచేయకపోవడం గమనార్హం. ఎవరు ఎన్ని అన్నా.. ఆమె పట్టించుకోవడం లేదు. దీం తో పార్టీలో సీనియర్లు విసిగిపోతున్నారు.
ఫలితంగా ఎవరికి నచ్చిన దారిలో వారు నడుస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు కీలక నాయకులు పార్టీకి దూ రంగా ఉన్నారు. సాకే వంటివారు పార్టీ మారిపోయారు. తాజాగా షర్మిల సొంత జిల్లా కడపలో భారీ ఎదురు దెబ్బతగిలింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన అఫ్జల్ ఖాన్.. పార్టీకి రాజీనామా చేశా రు. ప్రస్తుతం ఆయన కడప కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన సుమారు 25 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు.
అయితే.. పార్టీ ఓడిన తర్వాత..షర్మిల అసలు తమను పట్టించుకోవడం మానేసిందని.. వ్యక్తిగత రాజకీయా లు చేస్తున్నారని అందుకే తాను పార్టీని వీడానని అఫ్జల్ చెప్పుకొచ్చారు. ``షర్మిలకు రాజకీయాలు అనవ సరం`` అని ఒకింత కఠినంగానే వ్యాఖ్యానించారు. ఆమె మారనంత వరకు పార్టీలో ఎలాంటి మార్పు రాదని.. ప్రజల కోసం కాకుండా.. అన్న ను తిట్టేందుకు.. కూటమికి సహకారం చేసేందుకు మాత్రమే షర్మిల పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. ఇలా.. షర్మిలకు సొంత జిల్లాలోనే సెగ తగలడం గమనార్హం.