బీజేపీ తొలి జాబితాలో ఉండేది వీరేనా?
మొదటి జాబితాను విడుదలైన తర్వాత సీన్ మారుతుందని.. గెలుపు ధీమా వ్యక్తం కావటమే కాదు.. అధికార పార్టీకి ముచ్చమటలు పోసేలా కమలనాథుల వ్యూహం ఉంటుందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2023 6:22 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసి వారం దాటుతున్నా.. తమ సత్తా చాటుతామని చెబుతున్న బీజేపీ తన అభ్యర్థులను మాత్రం ఇంకా ప్రకటించకపోవటం తెలిసిందే. పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోందని.. తమ తొలి జాబితాతోనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా తమ జాబితా ఉంటుందని చెబుతున్నారు. మొదటి జాబితాలోనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపించటంతో పాటు.. గెలుపు ధీమా వ్యక్తమయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రోజు (సోమవారం) సాయంత్రానికి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తారంటున్నారు. తొలి జాబితాలో 39 మంది ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పార్టీ కీలక నేతల్ని అసెంబ్లీ బరిలోకి దించటం ద్వారా అధికార పార్టీకి దిమ్మ తిరిగేలా చేస్తారని అంటున్నారు. బండిని తెలంగాణ బీజేపీ రథసారధిగా తప్పించిన నాటి నుంచి తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్న దానికి బదులుగా తాజా జాబితా ఉంటుందంటున్నారు.
మొదటి జాబితాను విడుదలైన తర్వాత సీన్ మారుతుందని.. గెలుపు ధీమా వ్యక్తం కావటమే కాదు.. అధికార పార్టీకి ముచ్చమటలు పోసేలా కమలనాథుల వ్యూహం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అధికారంలో వచ్చే ఛాన్సు లేకున్నా.. 15-20 స్థానాల్లో విజయం సాధించటం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలకభూమిక పోషించాలన్నదే లక్ష్యమంటున్నారు.
తొలి జాబితాలో 40 లోపు అభ్యర్థులు ఉంటారని.. అందులో కనీసం డజను మంది గెలవటం ఖాయమన్న ధీమా వ్యక్తమయ్యేలా పేర్లు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న ఆయా నేతలు వారు పోటీ చేయనున్న స్థానాల్ని చూస్తే..
నియోజకవర్గం అభ్యర్థి పేరు
అంబర్ పేట కిషన్ రెడ్డి
కరీంనగర్ బండి సంజయ్
హుజురాబాద్ ఈటల రాజేందర్
ముషీరాబాద్ విజయలక్ష్మీ రెడ్డి
సనత్ నగర్ మర్రి శశిధర్ రెడ్డి
మల్కాజిగిరి రామచంద్రరావు
గోషామహల్ విక్రమ్ గౌడ్
సికింద్రాబాద్ బండ కార్తీక రెడ్డి
కుత్భుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్
మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి
చొప్పదండి శోభ
భూపాల్ పల్లి కీర్తి రెడ్డి
అదిలాబాద్ పాయం శంకర్
బోధ్ సోయం బాపూరావు
కోరుట్ల అర్వింద్
పరకాల ప్రేమేందర్ రెడ్డి
గద్వాల డీకే అరుణ