Begin typing your search above and press return to search.

టి.కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 55 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ఇదే!

తెలంగాణ ఎన్నికల్లో మరో అసక్తికర పరిణామం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 5:10 AM GMT
టి.కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 55 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ఇదే!
X

తెలంగాణ ఎన్నికల్లో మరో అసక్తికర పరిణామం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా ముందుగా 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో కొత్తవారికి కూడా ఎక్కువగానే అవకాశం ఇచ్చిన టి.కాంగ్రెస్... పలువురు ఎంపీలను ఈ సారి అసెంబ్లీకి పంపించాలని వ్యూహరచన చేసింది.

అవును... తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి 55 మందితో అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. వామపక్షాలతో పొత్తుపై ఇవాళ స్పష్టత రానుందని కథనాలొస్తున్న నేపథ్యంలో... మిగతా స్థానాలపై చర్చించి మరో మూడు నాలుగు రోజుల్లో రెండో జాబితాను విడుదల చేస్తారని తెలుస్తుంది. అయితే... ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నారని అంటున్నారు. కానీ... మొదటి జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం.

ఈ తొలి జాబితా ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నుంచి పోటీ చేస్తుండగా... కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయనున్నారు. ఇక మాజీ పీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తం కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తుండగా... మైనంపల్లి రోహిత్‌ రావు మెదక్ నుంచి నిలబడుతున్నారు.

టి. కాంగ్రెస్ తొలి జాబితా అభ్యర్థులు వీరే..:

బెల్లంపల్లి (ఎస్సీ) - గడ్డం వినోద్‌

మంచిర్యాల - ప్రేం సాగర్‌ రావు

నిర్మల్‌ - శ్రీహరి రావు

ఆర్మూర్‌ - ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి

బోధన్‌ - సుదర్శన్‌ రెడ్డి

బాల్కొండ - సునీల్‌ కుమార్‌ ముత్యాల

జగిత్యాల - జీవన్‌ రెడ్డి

ధర్మపురి (ఎస్సీ) - లక్ష్మణ్‌ కుమార్‌

రామగుండం - ఎం.ఎస్. రాజ్‌ ఠాకూర్‌

మంథని - దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

పెద్దపల్లి - చింతకుంట విజయ్‌ రమణారావు

వేములవాడ - ఆది శ్రీనివాస్‌

మానకొండూరు (ఎస్సీ) - కవ్వంపల్లి సత్యనారాయణ

మెదక్‌ - మైనంపల్లి రోహిత్‌ రావు

అందోల్‌ (ఎస్సీ) - దామోదర రాజనర్సింహ

జహీరాబాద్‌ (ఎస్సీ) - ఆగం చంద్రశేఖర్‌

సంగారెడ్డి - జగ్గారెడ్డి

గజ్వేల్‌ - తూముకుంట నర్సారెడ్డి

మేడ్చల్‌ - తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌

మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ - కొలన్‌ హన్మంత్‌ రెడ్డి

ఉప్పల్‌ - పరమేశ్వర్‌ రెడ్డి

చెవేళ్ల (ఎస్సీ) - భీం భరత్‌

పరిగి - టి. రామ్మోహన్‌ రెడ్డి

వికారాబాద్‌ - గడ్డం ప్రసాద్‌ కుమార్‌

ముషీరాబాద్‌ - అంజన్‌ కుమార్‌ యాదవ్‌

మలక్‌ పేట - షేక్‌ అక్బర్‌

సనత్‌ నగర్‌ - కోట నీలిమ

నాంపల్లి - ఫిరోజ్‌ ఖాన్‌

కార్వాన్‌ - ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజ్రి

గోషామహల్‌ - మొగిలి సునీత

చాంద్రయణగుట్ట - బోయ నగేశ్‌ (నరేశ్‌)

యాకత్‌ పుర - కె. రవి రాజు

బహదూర్‌ పుర - రాజేష్ కుమార్‌ పులిపాటి

సికింద్రాబాద్‌ - ఎ. సంతోష్‌ కుమార్‌

కొడంగల్‌ - రేవంత్‌ రెడ్డి

గద్వాల - సరితా తిరుపతయ్య

అలంపూర్‌ (ఎస్సీ) - సంపత్‌ కుమార్‌

నాగర్‌ కర్నూల్‌ - కె. రాజేష్ రెడ్డి

అచ్చంపేట్‌(ఎస్సీ) - సీహెచ్‌ వంశీకృష్ణ

కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ్‌ రెడ్డి

షాద్‌ నగర్‌ - కె. శంకరయ్య

కొల్లాపూర్‌ - జూపల్లి కృష్ణారావు

నాగార్జున సాగర్‌ - కుందూరు జయవీర్‌

హుజూర్‌ నగర్‌ - ఉత్తం కుమార్‌ రెడ్డి

కోదాడ - పద్మావతి రెడ్డి

నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

నకిరేకల్‌ (ఎస్సీ) - వేముల వీరేశం

ఆలేరు - బీర్ల ఐలయ్య

స్టేషన్‌ ఘన్‌ పూర్‌ (ఎస్సీ) - సింగాపురం ఇందిర

నర్సంపేట - దొంతి మాధవ్‌ రెడ్డి

భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ రావు

ములుగు (ఎస్టీ) - సీతక్క

మధిర (ఎస్సీ) - మల్లు భట్టి విక్రమార్క

భద్రాచలం - పొదెం వీరయ్య