Begin typing your search above and press return to search.

తెలంగాణ చరిత్రలో తొలిసారి అంబులెన్సులో వచ్చి నామినేషన్

తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు గురి కావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Nov 2023 5:52 AM GMT
తెలంగాణ చరిత్రలో తొలిసారి అంబులెన్సులో వచ్చి నామినేషన్
X

తెలంగాణ చరిత్రలో తొలిసారి అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు అంబులెన్సులో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరహా పరిణామం ఇంతకు ముందెప్పుడు చోటు చేసుకున్నది లేదు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు గురి కావటం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు వీలుగా నామినేషన్ దాఖలుకు అంబులెన్సులో వచ్చారు.

హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఆయన.. వైద్యుల సూచన మేరకు అంబులెన్సులో వచ్చారు.ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వాహనానికి అడ్డు తగిలారు. ఈ క్రమంలో ఆయన్ను పడుకొనే అభివాదం చేయాల్సిందిగా వైద్యులు సూచన చేయటంతో ఆయన దాన్ని పాటించారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపటం కనిపించింది. నామినేషన్ దాఖలు చేయటానికి అంబులెన్సులోనే వచ్చిన ఆయన్ను నేరుగా ఐవోసీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ముహుర్తంలో భాగంగా నామినేషన్ పత్రాల్ని రిటర్నింగ్ అధికారికి ప్రభాకర్ రెడ్డి అందించారు. రెండో సెట్ నుహరీశ్ రావుతో కలిసి సమర్పించారు. అంబులెన్సు్లో వచ్చిన కొత్త ప్రభాకర్ ను మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హేస్సేన్ ఆఫీసులోకి తీసుకెళ్లారు. మంత్రి హరీశ్ సహకారంతో వీల్ ఛైర్ లో బయటకు వచ్చిన కొత్త ప్రభాకర్ తిరిగి అంబులెన్సులో యశోదా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలా.. అంబులెన్సులో వచ్చి నామినేషన్ దాఖలు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.