Begin typing your search above and press return to search.

చేపల పొట్టలో మాదకద్రవ్యాలు... తెరపైకి షాకింగ్ విషయాలు!

ఈ నేపథ్యంలో... బ్రెజిల్ లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది.

By:  Tupaki Desk   |   27 July 2024 1:30 PM GMT
చేపల పొట్టలో మాదకద్రవ్యాలు... తెరపైకి షాకింగ్  విషయాలు!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలకూ ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఉగ్రవాదం, పేదరికం ఒకరకం అయితే.. మాదకద్రవ్యాలు అనేది మరోరకం సమస్యగా ఉంది. ప్రస్తుతం వీటి కారణంగా పలు దేశాల్లో ప్రజల జీవనశైలి మారిపోయిందని.. నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ లో కొకైన్ షార్క్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

అవును... ఫ్లోరెడా, దక్షిణ - మధ్య అమెరికా తీరాలకు డ్రగ్స్ ని చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్న నేపథ్యంలో అధికారుల దాడులు జరిగే సమయంలో... టన్నుల కొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలో వేస్తున్నారంట. దీని వల్ల ఆ డ్రగ్స్ ప్రభావానికి ఈ చేపలు గురవుతున్నాయని అంటున్నారు. దీంతో... మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ఈ డ్రగ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో... బ్రెజిల్ లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. ఈ సముద్ర తీరంలోని చేపల్లో మాదకద్రవ్యాల ప్రభావం ఏమేరకు ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీని కోసం 13 షార్క్ చేపలను చిన్న పడవల నుంచి కనుగోలు చేశారు. ఇవి జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయని చెబుతున్నారు.

ఈ 13 చేపల్లోనూ రెండు మగ చేపలు, 10 ఆడచేపలు.. ఆ పదింటిలో ఐదు గర్భవతులుగా ఉన్న చేపలను పరీక్షలకు ఎంచుకున్నారంట. అనంతరం వీటి కండరాలు, లివర్ ని పరిశోధించినప్పుడు వీటిలో కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. పరిశ్రమల నుంచి నేరుగా సముద్రంలో కలిసే మురిగినీటి సమస్యకు తోడు ఇప్పుడు ఈ కొకైన్ కూడా సముద్ర జలాలకు శాపంగా మారాయని అంటున్నారు.

ఇక, సొరచేపల ప్రవర్తన, ఆరోగ్యంపై ఈ కొకైన్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ఇదే సమయంలో ఈ సొరచేపల్లో లభించే కొకైన్ పరిమాణం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు గమనించారంట. ఇదే క్రమంలో... ఆడ చేపలకంటే మగ చేపల్లో కొకైన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు.