Begin typing your search above and press return to search.

అత్యంత ఘోరం... ఏపీలో 5 నెలల చిన్నారిపై అఘాయిత్యం!

ఇటీవల కాలంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 July 2024 8:30 AM GMT
అత్యంత ఘోరం... ఏపీలో 5 నెలల చిన్నారిపై అఘాయిత్యం!
X

ఇటీవల కాలంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంఘటనలు అయితే రాయడానికీ, చదవడానికీ, వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. స్త్రీలింగం అయితే చాలు... వయసుతో సంబంధంలేదు, వరసతో సంబంధంలేదు అన్నట్లుగా కామాందులు చెలరేగిపోతున్నారు.

ప్రతీ రోజూ ఏదో ఒక మూల బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ముక్కుపచ్చలు ఆరని పసికందుల నుంచి అభంశుభం తెలియని పిల్లల వరకూ ఈ మృగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. ఆడుకుందామని పిలిచి ఒకరు, చాక్లెట్ ఆశచూపించి ఇంకొకరు, బుజ్జగిస్తూ మరొకరు తమ కామదాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలే కాదు, ఇంటివద్ద ఆడుకుంటున్న పిల్లలు కూడా ఈ దారుణాలకు బలవుతున్నారు. ఈ క్రమంలో తల్లి ఒడిలోనూ, ఉయ్యాలలో ఆడుకుంటున్న పసికందులపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది.

అవును... నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఆడుకుందామని తీసుకెళ్లి అత్యాచారం చేసి, అనంతరం ఆమెను చంపేసి శవాన్ని మాయం చేశారు! చేసిన వారు కూడా మైనర్లే కావడం గమనార్హం!! ఇదే క్రమంలో తాజాగా 5 నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అవును.... విజయనగరం జిల్లాలో 5 నెలల చిన్నరిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జీలుగువలసలో వరుసకు తాత అయిన వ్యక్తి ఊయలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లితండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో... అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో... తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇలా నెలల పసికందులపై అత్యాచారానికి పాల్పడటాన్ని ఎలా చూడాలన్నది సమాజమే ఆలోచించుకోవాలి.. అలాంటి వారికి ఎలాంటి శిక్షలు వేయాలనేది న్యాయస్థానాలే పరిశీలించాలి! బలమైన శిక్షలే నేరం చేయాలనే ఆలోచనను చంపేస్తాయనేది చాలా మంది అభిప్రాయం అనేది తెలిసిన విషయమే!