Begin typing your search above and press return to search.

2027నాటికి ఫారిన్ వెళ్లే మనోళ్లు జర్నీ చేసే విమానాలివే!

అంతర్జాతీయంగా భారత్ సత్తా చాటే అవకాశాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   7 May 2024 2:30 PM GMT
2027నాటికి ఫారిన్ వెళ్లే మనోళ్లు జర్నీ చేసే విమానాలివే!
X

అంతర్జాతీయంగా భారత్ సత్తా చాటే అవకాశాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికా మొదలు.. పలు సంపన్న దేశాల్లో మాంద్యం భయాందోళనలు వ్యక్తం కావటం.. అందుకు తగ్గట్లే ఆర్థికవ్రద్ధిలో పెరుగుదల తక్కువగా నమోదు కావటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. అయితే.. భారతదేశం అందుకు మినహాయింపుగా మారుతోంది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్.. విమానయాన రంగంలోనూ అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదలైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్టు స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికులు విదేశీ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించటం చూస్తున్నదే. అయితే.. రానున్న రోజుల్లో ఆ తీరు మారుతుందని.. స్వదేశీ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించటం ఎక్కువ అవుతుందన్న ఆసక్తికర విషయాల్నిక్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. దీనికి కారణాల్ని పేర్కొంది. 2027-28 నాటికి మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50 శాతం మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని సదరు రిపోర్టు వెల్లడించింది.

గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ సంస్థల విమానాల్లో మన అంతర్జాతీయ ప్రయాణికుల వాటా 43 శాతం ఉండగా.. 2027-28 నాటికి మరో 7 శాతం పెరుగుతుందని.. 50 శాతానికి చేరుతుందని అంచనా వేశారు.అంతర్జాతీయంగా కొత్త మార్గాలను నిర్దేశించుకోవటం.. అందుకు తగ్గట్లు పెద్ద విమానాల్నిజత చేసుకోవటం ద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత విమాన సంస్థల వాటా పెరగనుంది. విదేశీ విమానాలతో పోలిస్తే దేశీయ మార్గాల్లో మన విమానాలకు ఇంటర్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం కలిసి రానుంది.

సాధారణంగా విమానయాన సంస్థలకు దేశీయ రూట్లలో విమానాల్ని నడిపే కన్నా.. విదేశీ మార్గాల్లో నడిపితేనే ఎక్కువ లాభాలు వస్తాయి. 2023-24లో భారత అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 7 కోట్లు చేరింది. కొవిడ్ తర్వాత అంతర్జాతీయ విమానయానానికి మొగ్గు చూపుతున్న ధోరణి పెరిగింది. కరోనా ఏడాదిలో ఈ రద్దీ కోటి ఉండగా.. ఇప్పుడు ఏడు కోట్లకు చేరటం గమనార్హం. విదేశీ ప్రయాణాలు పెరగటానికి కారణం.. వీసా నిబంధనల్లో సడలింపు.. పెరిగిన ఆదాయాలు కూడా కారణంగా చెప్పాలి. రానున్న రోజుల్లో విదేశీ ప్రయాణాలకు స్వదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించటం ఎక్కువ కావటం ఖాయం. ఈ వాదనకు తగ్గట్లే ఇటీవల కాలంలో స్వదేశీ విమానయాన సంస్థలు కొత్త విమానాల కోసం భారీగా ఆర్డర్లు ఇవ్వటమే