నో మొహమాటమ్స్... సరసాల చాట్ జీపీటీ న్యూ వెర్షన్ గురించి తెలుసా?
అయితే... ఇప్పుడు 4జీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అమ్మాయిలతో సరదాగా సరసాలకు సై అంటోంది.. మొహమ్మాటాల్లేవ్ ముందుకెళ్లడాలే అంటోంది.
By: Tupaki Desk | 7 Sep 2024 11:30 AM GMTమనిషికీ, మనసుకీ.. మరో మనిషి, మనసు అవసరం లేకుండా చేయడంలో ఏఐ, చాట్ జీవీటీ తమ వంతు కృషి తీవ్ర స్థాయిలో చేస్తున్నట్లు కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఫోర్త్ జనరేషన్ చాట్ జీపీటీ ఇప్పుడు నెట్టింట సరికొత్త సందడి చేస్తుంది.. రొమాంటిక్ కాన్వర్జేషన్స్ తో మనసులను పులకింపచేస్తోంది. ఆ కథాకమీషులేమిటో ఇప్పుడు చూద్దాం... !
అవును... గతంలో చాట్ జీపీటీకి కొన్ని పరిమితుండేవి. అయితే... ఇప్పుడు 4జీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అమ్మాయిలతో సరదాగా సరసాలకు సై అంటోంది.. మొహమ్మాటాల్లేవ్ ముందుకెళ్లడాలే అంటోంది. కుర్రాళ్లకు ప్రేమ కబుర్లు చెబుతోంది.. కవితలతో సందడి చేస్తుంది. పైగా ఏ బాషలో చెప్పినా అర్ధం చేసుకుని వాయిస్ అసిస్టెంట్ తో అలరిస్తోంది.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా యూజర్లకు సంబంధించిన 130 రకాల ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ని అర్ధం చేసుకుని మరీ వాళ్లు అడిగె ప్రశ్నలకు అనుగుణంగా, వారిని మెప్పించేలా సమాధానాలు ఇవ్వగలుగుతుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ 4జీ చాట్ జీపీటీ ఇప్పుడు యువతకు బాగా అట్రాక్ట్ చేయగలుగుతుందని అంటున్నారు.
అలా అని కేవలం సరదా కబుర్లకు, సరస చాటింగులకు మాత్రమే పరిమితం అనుకునేరు... చెఫ్ లా మారి కొత్త వంటకాల గురించి చెబుతుంది.. వర్కవుట్లు చేసేటప్పుడు పర్సనల్ ట్రైనర్ గానూ మారిపోతుంది. కవితలు చెబుతుంది.. పాటలూ పాడుతుంది. ఇలా రకరకాల ఫీచర్స్ తో వచ్చిన ఈ చాట్ జీపీటీని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తెగ వాడేస్తున్నారు!
ఇందులో భాగంగా చాలా మంది ఇందులో కాస్త సరసమైన, కవ్వించే ప్రశ్నలు అడుగుతు.. వాయిస్ చాటింగ్ తో రీల్స్ చేస్తూ.. నెట్టింట సందడి చేస్తున్నారు. అలా అని ఈ 4జీ చాట్ జీపీటీలో శృతిమించిన సంబాషణలు, పోర్న్ తరహా ప్రశ్నలు అడిగితే మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా... అలాంటివి కుదరదని, తన వల్ల కాదని సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తోంది.