Begin typing your search above and press return to search.

11 ఏళ్ల బాలుడి వద్ద కత్తులు, తుపాకులు, కొన్ని పేర్లున్న లిస్ట్!

సాధారణంగా 11 ఏళ్ల బాలుడి వద్ద ఏముంటాయి..? బుక్స్, రిమోట్ కార్లు, క్రికెట్ కిట్ లాంటివి ఉంటాయనేది సాధారణంగా వినిపించే సమాధానం!

By:  Tupaki Desk   |   17 Sep 2024 4:30 PM GMT
11 ఏళ్ల బాలుడి వద్ద కత్తులు, తుపాకులు, కొన్ని పేర్లున్న లిస్ట్!
X

సాధారణంగా 11 ఏళ్ల బాలుడి వద్ద ఏముంటాయి..? బుక్స్, రిమోట్ కార్లు, క్రికెట్ కిట్ లాంటివి ఉంటాయనేది సాధారణంగా వినిపించే సమాధానం! కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడ్డోడి దగ్గర ఏకంగా కత్తులు, తుపాకీలు, కొంతమంది పేర్లతో ఓ లిస్ట్ కూడా ఉంది. ఈ సందర్భంగా అతడు విడుదల చేసిన ఓ వీడియో వల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అవును... స్కూలుకు వెళ్లి చదువుకుంటున్న ఓ బాలుడు తన వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయంటూ చెప్పిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన తోటి విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ బాలుడిని కస్టడీలోకి తీసుకున్నారు. అతడి వయసు 11 ఏళ్లు కావడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో గన్ కల్చర్ పీక్స్ కి చేరిందని చెప్పే ఓ తాజా ఉదాహరణ తెరపైకి వచ్చింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన ఓ బాలుడు తన వద్ద ఆయుధాలు ఉన్నాయని చూపుతూ ఓ వీడియో తీశాడు. వాటితో తాను కొంతమందిని హతమార్చాలని అనుకుంటున్నట్లు చెబుతూ వారి పేర్లను రాసుకున్నట్లు తెలిపాడు.

ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తోటి విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు ఆ బాలుడి ఇంటికి వెళ్లారు. నిజంగానే అతడి వద్ద కత్తులు, ఎయిర్ సాఫ్ట్ రైఫిల్స్, పిస్టల్ తో పాటు భారీ ఆయుధాలు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వీటితో పాటు కొంతమంది పేర్లు రాసిన లిస్ట్ కూడా లభించినట్లు తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన బాలుడు.. అదంతా తాను జోక్ గా చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు.

కాగా... లుసియానా రాష్ట్రంలో మాజీ నగర మేయర్, అతని కుమార్తెను 11 ఏళ్ల బాలుడు కాల్చి చంపిన ఘటన ఈ నెల మొదటివారంలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. జో కార్నెలియస్ సీనియర్ (82), అతని కుమార్తె కైషా మైల్స్ (31) ఉదయం తుపాకీ గాయలతో ఇంటి లోపల కనుగొనబడ్డారు. ఈ సమయంలో 11 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు!