Begin typing your search above and press return to search.

లైంగిక వాంఛలను పెంచే ఆహారాలేంటో తెలుసా?

శృంగార వాంఛలు బలంగా ఉండాలంటే మనం కొన్ని ఆహారాలు తీసుకోవాలి. దీంతో కామోద్దీపన శక్తి పెరిగి లైంగిక వాంఛలు బలంగా పెరుగుతాయి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 10:30 AM GMT
లైంగిక వాంఛలను పెంచే ఆహారాలేంటో తెలుసా?
X

శృంగారం బంగారం కంటే విలువైనదని భావిస్తారు. జీవితంలో శృంగారంతోనే బంధాలు ఇమిడి ఉంటాయి. మగవాడి సామర్థ్యం ఎంత బాగా ఉంటే భార్య అంత సంతోషపడుతుంది. భర్త మీద ప్రేమ వ్యక్తం చేస్తుంది. ఆలుమగల బంధంలో శృంగారమే ప్రధాన భూమిక పోషిస్తుందనేది నిర్వివాదాంశం. శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శృంగారంతో మన ఆరోగ్యం ముడిపడి ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగాలు లేకుండా ఉండాలంటే కూడా శృంగారమే కీలక పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి.

శృంగార వాంఛలు బలంగా ఉండాలంటే మనం కొన్ని ఆహారాలు తీసుకోవాలి. దీంతో కామోద్దీపన శక్తి పెరిగి లైంగిక వాంఛలు బలంగా పెరుగుతాయి. దీంతో జీవిత భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. కామవాంఛలు బలంగా ఉంటే దంపతుల మధ్య అనురాగం, ప్రేమ పెరుగుతాయి. మగాడి మీద భార్యకు మంచి ఉద్దేశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే మనం తీసుకునే ఆహారాలు కూడా బలమైనవి ఉండాలి.

ఉల్లిపాయల్లో కామోద్దీపన శక్తి ఎక్కువగా ఉంటుంది. అంగస్తంభన సమస్య లేకుండా చేస్తుంది. అరటి పండ్లలో కూడా లైంగిక శక్తిని ప్రేరేపించే శక్తి ఇమిడి ఉంటుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి6 వంటివి ఉండటంతో శృంగార వాంఛలు పెరుగుతాయి. శీఘ్ర స్కలన సమస్య ఉన్న వారికి క్యారెట్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా క్యారెట్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఎండు ద్రాక్ష లైంగితను పెంచుతుంది. ఇందులో ఉండే చక్కెర లైంగికత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మంచి కామ వాంఛలు వస్తాయి. ఖర్జూరాలు కూడా శృంగార కోరికలను పెరిగేలా చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్ మనలో కామోద్దీపనలు పెంచుతాయి. పోషకాలు లైంగిక శక్తిని ఇనుమడింపచేస్తాయి. లైంగిక శక్తిని పెంచడంలో బెండకాయలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

అల్లం రెగ్యులర్ గా తీసుకుంటే సంతాన లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. శీఘ్ర స్కలనం కూడా దూరమవుతుంది. వెల్లుల్లిలో కూడా కామవాంఛలు పెంచే గుణం ఉంటుంది. అంగస్తంభనను పెంచుతుంది. లైంగిక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. మునగ కాయ లైంగిక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. దీన్ని తినడం ద్వారా లైంగిక ఆసక్తి పెరిగేలా చేస్తుంది.