Begin typing your search above and press return to search.

లేట్ గా ఎన్నికలు...బాబు హ్యాండ్ ఉందా...!?

ఆయన ఎన్డీఏలో చేరిన తరువాత ఈ తరహా వత్తిళ్ళు ఎన్డీయే పెద్దల మీద పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఈసీ దీనిని ఎలా ఆమోదించింది అంటే సాధారణంగా ఈసీ ఎపుడు అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది

By:  Tupaki Desk   |   17 March 2024 8:47 AM GMT
లేట్ గా ఎన్నికలు...బాబు హ్యాండ్ ఉందా...!?
X

ఏపీలో ఆలస్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దీని విషయంలో అన్ని రాజకీయ పార్టీలలో చర్చ అయితే ఒక స్థాయిలో సాగుతోంది. ఎన్నికలు ఎంత ఆలస్యంగా జరిగితే విపక్షానికి అంత మేలు అన్నది ఒక లాజిక్ కి అందని అభిప్రాయం. ఇపుడు కూడా విపక్ష కూటమికి మేలు చేసేందుకే ఎన్నికలు ఆలస్యంగా పెడుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.

నిజానికి చూస్తే ఏపీలో ఎపుడూ ముందుగానే ఎన్నికలు జరుగుతూ ఉండేవి. 2019లో అదే జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కి పోలింగ్ కి మధ్య కేవలం 32 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. కానీ ఇపుడు చూస్తే ఏకంగా 57 రోజుల వ్యవధి వచ్చింది. ఇది సుదీర్ఘమైనది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల కోసం ఎదురుచూడడం అంటే కచ్చితంగా అది అధికార పక్షానికి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

అయితే ఈ విషయంలో సర్వ స్వతంత్ర సంస్థగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దానికి ఈసీ చెప్పిన కారణం ఏంటి అంటే ఏపీ శాసన సభకు గడువు జూన్ 16 వరకూ ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వానికి తొందరేమీ లేదని. అదే నిజం అనుకున్నా ఏప్రిల్ లో ఎన్నికలు తొలి విడతలో పెట్టినా ఫలితాలు వచ్చేసరికి ఎటూ జూన్ 4 వ తేదీయే అవుతుంది.

అలా అపుడు కూడా అదే టైం కి కొత్త ప్రభుత్వం వస్తుంది. మరి తొలి విడత మలి విడత కాదు, కనీసం మూడవ విడత కాకుండా నాలుగవ విడతలో ఎందుకు ఎన్నికలు తోసేశారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్న చర్చ. దీని వెనక టీడీపీ అధినేత చంద్రబాబు హ్యాండ్ ఉందని అంటున్నారు

ఆయన ఎన్డీఏలో చేరిన తరువాత ఈ తరహా వత్తిళ్ళు ఎన్డీయే పెద్దల మీద పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఈసీ దీనిని ఎలా ఆమోదించింది అంటే సాధారణంగా ఈసీ ఎపుడు అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. దాని ప్రకారమే ఎన్నికలకు వెళ్తుంది. అక్కడ రాజకీయ వత్తిళ్లు ఉండవు. కానీ ఏ దశలో అయినా ఎన్నికలు పెట్టే స్వేచ్చ హక్కు ఈసీకి పూర్తిగా ఉన్నాయి.

అయితే ఫ్రీ అండ్ ఫైర్ పోల్ కోసం ఈసీ చూస్తుంది. ఆ విధంగా అనుకుంటే కనుక ఈసీ నాలుగవ విడత పోలింగ్ డేట్ ని ఎవరూ తప్పుపట్టే చాన్స్ లేదు అయితే ఒడిషా లాంటి 147 సీట్లు ఉన్న రాష్ట్రంలో ఆ సీట్లకు కూడా మూడు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. ఏపీలో అటువంటిది లేకుండా ఒకేసారి మే 13న పోలింగ్ జరిపించేస్తున్నారు అని కూడా భావించాలి. ఎందుకంటే ఏపీలో సమస్యాత్మకమైన ప్రాంతాలు లేవు అని అంటున్నారు.

మరో విషయం చూస్తే కనుక ఈసీ డెసిషన్ ఇది. అయితే దీన్ని టీడీపీ వర్గాలు మాత్రం తమ అధినేత చంద్రబాబు చొరవ జోక్యంతోనే వెనక్కి జరిపారు అని చెప్పుకుంటున్నారుట. కేంద్రంలోని ప్రభుత్వం తమ వైపు ఉందని కూడా టీడీపీ తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారుట.

ఏది ఏమైనా ఎలక్షనీరింగ్ లోనూ వ్యవస్థలను కంట్రోల్ చేయడంలోనూ టీడీపీ తనదైన చాతుర్యం ఈసారి చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. టీడీపీ సంగతి ఇలా ఉంటే వైసీపీ మాత్రం కౌంట్ డౌన్ క్లాక్ ని తన ప్రధాన కార్యాలయం వద్ద పెట్టుకుంది. మరో 70 రోజులలో మరోసారి సీఎం జగన్ అని కూడా కౌంట్ డౌన్ అంటూ స్టార్ట్ చేసింది. దీనిని బట్టి చూస్తే ఎన్నికలు మొదటి విడతలో ఏప్రిల్ లో జరుగుతాయనే వైసీపీ చివరాఖరి దాకా భావించింది అనుకోవాలి.

అందుకే హడావుడిగా ఒకేసారి మొత్తం అభ్యర్ధుల జాబితాను జగన్ రిలీజ్ చేశారు అని అంటున్నారు. ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ని ప్రకటించారు అని చెబుతున్నారు. ఇపుడు చూస్తే గట్టిగా రెండు నెలల సమయం ఉంది. ఈ సమయం విపక్షానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు.