Begin typing your search above and press return to search.

సినిమాటిక్ చోరీ.. కంపెనీలోకి చొరబడి భారీగా కొల్లగొట్టేశారు

తాజాగా ముగ్గురు గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో ఈ స్టోర్ లోకి జొరబడ్డారు. ఇద్దరు నిందితులు దోచేస్తుంటే.. వారికి కాపలాగా మరొకరు వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   21 May 2024 4:02 AM GMT
సినిమాటిక్ చోరీ.. కంపెనీలోకి చొరబడి భారీగా కొల్లగొట్టేశారు
X

రీల్ లో చూసే గ్రేట్ రాబరీ తరహా భారీ చోరీ రియల్ గా చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ చోరీ షాకిచ్చేలా ఉంది. విలాస ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీలోకి మారణాయుధాలతో జొరబడిని దుండగులు కోట్లాది రూపాయిల విలువైన విలాస ఉత్పత్తుల్ని దోచేసిన వైనం ఇప్పుడు ఫ్రాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాషన్ రాజధాని పారిస్ లోని హ్యారీ విన్ స్టన్ కంపెనీ అన్నంతనే విలాస వస్తువులకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తారు.

జ్యువెలర్స్ టు ది స్టార్స్ గా దీనికి పేరుంది. పేరు మోసిన సెలబ్రిటీలు.. సంపన్నులు.. ప్రముఖులు ఇక్కడ ఆభరణాల్ని కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ముగ్గురు గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో ఈ స్టోర్ లోకి జొరబడ్డారు. ఇద్దరు నిందితులు దోచేస్తుంటే.. వారికి కాపలాగా మరొకరు వ్యవహరించారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ చోరీ అనంతరం నిందితులు టూవీలర్ మీద పరారయ్యారు.

కోట్లాది రూపాయిల విలువ చేసే ఆభరణాల్ని కొల్లగొట్టినట్లుగా చెబుతున్నారు. దుండగుల వద్ద మారణాయుధాలు ఉండటంతో వారిని పోలీసులు నిలువరించలేకపోయారు. సినిమాల్లో మాదిరి సాగిన ఈ చోరీ లెక్క తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సంచలనంగా మారిన ఈ చోరీ విచారణను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.

ఇంత విలాసవంతమైన ఉత్పత్తుల్ని అమ్మేస్టోర్ లో ఈ తరమాలో చోరీ జరగటం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ దోచుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అప్పట్లో జరిగిన చోరీలో దాదాపు ఎనిమిది మందిని దోషులుగా తేల్చారు. తాజా చోరీకి సంబంధించిన నిందితుల్ని గుర్తించాల్సి ఉంది.