Begin typing your search above and press return to search.

ఆరేళ్ల చిన్నారితో సహా 299 మందిపై అత్యాచారం.. ఎవరీ సర్జన్?

ఇందులో ఆరెళ్ల చిన్నారి సహా పలువురు చిన్నారులు ఉండటం మరింత విచారకరం!

By:  Tupaki Desk   |   25 Feb 2025 7:47 AM GMT
ఆరేళ్ల చిన్నారితో సహా  299 మందిపై అత్యాచారం.. ఎవరీ సర్జన్?
X

తాజాగా ఓ సర్జన్ కు సంబంధించిన పైశాచికత్వం తెరపైకి వచ్చింది. వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించిన విషయం సంచలనంగా మారింది. సుమారు మూడు దశాబ్ధాల పాటు తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందులో ఆరెళ్ల చిన్నారి సహా పలువురు చిన్నారులు ఉండటం మరింత విచారకరం!

అవును... ఫ్రాన్స్ లో 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్ అనే సర్జన్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. సుమారు 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై అతడు ఈ దారుణాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. వారు మత్తులో ఉండగా.. చిన్నా, పెద్దా అనే తారతమ్యాలు లేకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాన్స్ లోని బ్రిటానీ అనే ప్రాంతంలో జోయెల్ లి స్కౌర్నెక్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో తన కెరీర్ లో తన వద్దకు వచ్చే రోగులు మత్తులో ఉండగా లైంగిక వారిపై లైంగిక దాడి చేసేవాడు. ఈ క్రమంలో అతడి అకృత్యాలు 2017లో బయటపడ్డాయి. తన పొరుగుంటిలో ఉన్న ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో తొలుత కేసు నమోదైంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా... పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ సమయంలో 3 లక్షలకు పైగా ఫోటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. ఎవరిపై ఎప్పుడు లైంగిక దాడి చెసింది నోట్ కూడా చేసుకున్నట్లు గుర్తించారని అంటున్నారు.

ప్రధానంగా... చిన్నారులు, జంతువులకు అతడు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నెరపుతున్నట్లు అతడి డైరీలో చూసిన అధికారులు ఒక్కసారిగా షాకైనట్లు చెబుతున్నారు. ఆరేళ్ల చిన్నారి ఘటన అనంతరం మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలిందట. దీంతో... 2020లో కోర్టు జోయెల్ ను దోషిగా తేల్చి 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

అయితే... ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన అధికారులకు.. ఈ సర్జన్ పాపాల చిట్టా బయటపడిందని చెబుతున్నారు. తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగికరించాడు. ఇందులో భాగంగా... 1989 నుంచి 2014 మధ్య 141 మంది అమ్మాయిలతో పాటు 158 మంది అబ్బాయిలపైనా అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో తెలిపాడు.

వీరిలో ఎక్కువమంది చిన్నారులనే విషయం న్యాయస్థానానికి వెల్లడించాడు. ఈ సందర్భంగా... తన వల్ల ఆ చిన్నారుల మనసుకు అయిన గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించినట్లు తెలిపాడు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా.. దోషిగా తేలితే 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.