వేలం పాటలో రికార్డు స్థాయి వసూలు రాబట్టిన నెపోలియన్ తుపాకులు..
కానీ వందల సంవత్సరాల పూర్వం ఉపయోగించిన తుపాకులు సుమారు 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి అన్న విషయం మీకు తెలుసా?
By: Tupaki Desk | 9 July 2024 12:30 AM GMTసాధారణంగా మన ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని సెకండ్ హ్యాండ్ లో అమ్మడం మనకు తెలిసిన విషయం. అయితే పురాతన వస్తువుల్ని కొన్నిటిని మంచి ఆక్షన్ లో చాలా ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. కానీ వందల సంవత్సరాల పూర్వం ఉపయోగించిన తుపాకులు సుమారు 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి అన్న విషయం మీకు తెలుసా?
యూరోప్ చరిత్ర మీద తనదైన ముద్రవేసిన నియంత నెపోలియన్. ఇతను గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.నెపోలియన్ బోనపార్ట్ వాడిన తుపాకీలు వేలం లో 1.69 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యాయి..అంటే మన కరెన్సీలో అక్షరాల 15 కోట్లు. నెపోలియన్ కి సంబంధించిన కొన్ని అరుదైన వస్తువులను వేలం వేశారు.. ఇందులో అతను ఉపయోగించిన రెండు తుపాకీలు ఉన్నాయి. వీటిలో ఒక తుపాకీతో ఆయన ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నారట. అయితే ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ,
1814,ఏప్రిల్ 12న నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలి అని భావించారట. ఈ రెండు తుపాకులలో ఒక తుపాకిని చేతిలోకి కూడా తీసుకున్నారు. కానీ ఎందుకో ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా నెపోలియన్ వెల్లడించారు. ఇక నెపోలియన్ ఉపయోగించిన ఈ రెండు తుపాకులను మెరైన్ గోస్సెట్ అనే సంస్థ తయారు చేసింది. ఈ రెండు తుపాకుల తయారీ విషయానికి వస్తే బంగారం వెండిని ఉపయోగించారు .ఈ తుపాకీలు నెపోలియన్‌కి వారసత్వంగా లభించాయి.
ఇన్ని సంవత్సరాల తర్వాత వేలం పాటకు వచ్చిన ఆర్తి పాకులు రికార్డు స్థాయిలో ధర పలకడం ఆ కంపెనీ వాళ్లతో పాటుగా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ప్రకటించింది. అయినప్పటికీ బహిరంగ వేలంలో ఒక ఫ్రాన్స్ పౌరుడు ఈ తుపాకులను కొనుగోలు చేశారు. అయితే ఈ తుపాకులను గట్టి పరిస్థితుల్లో ఫ్రాన్స్ దేశం దాటించి బయటకు తీసుకురావడం కుదరదు. వీలైనంత త్వరలో తిరిగి తుపాకులను ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.