పవన్ ఒక సారీ అన్నారంటే ?
పిఠాపురం సభలో పవన్ ఇదే ఇష్యూని రెట్టించారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్ హోదాలో ఉన్న బీఅర్ నాయుడు తొక్కిసలాట ఘటనకు క్షమాపణలు చెప్పారు.
By: Tupaki Desk | 11 Jan 2025 11:30 PM GMTపవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లో పవర్ స్టార్. అయితే 2024 ఎన్నికల ఫలితాలను దానికి ముందు ఆయన పన్నిన వ్యూహాలనూ చూసిన వారు అంతా పవన్ ని పొలిటికల్ పవర్ స్టార్ అని కూడా అంటారు. 2019లో పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు అయిన పవన్ 2024లో ఏకంగా చంద్రబాబు తరువాత ప్లేస్ అయిన ఉప ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆయన ఇపుడు అత్యంత కీలకంగా బలంగా కూడా ఉన్నారు.
ఎంతలా అంటే పవన్ మాటే శాసనం అన్నట్లుగా అని అంటున్నారు. ఆయన ఒకసారి చెబితే చాలు అన్నట్లుగా ఉంది. పవన్ ప్రభుత్వం తరఫున తిరుపతి తొక్కిసలాట ఘటనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆ మీదట టీటీడీ వంతు అన్నారు. అయితే దీని మీద టీటీడీ మొదట అంతగా రియాక్ట్ కాలేదు.
పిఠాపురం సభలో పవన్ ఇదే ఇష్యూని రెట్టించారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్ హోదాలో ఉన్న బీఅర్ నాయుడు తొక్కిసలాట ఘటనకు క్షమాపణలు చెప్పారు. ఆయన మొదట మీడియా సమావేశంలో మాట్లాడినపుడు క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అన్నట్లుగా మాట్లాడారు.
కానీ ఆయన ఆ తరువాత మళ్లీ ఆయనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ అలా నెరవేరింది అని అంటున్నారు. నిజానికి క్షమాపణలు చెబితే ఏమి అవుతుంది అన్నది కాదు తప్పు జరిగినపుడు బాధ్యత తీసుకుని మరోసారి ఇలా జరగదు అని పెద్ద మనసులో చెప్పడానికే అని అంటున్నారు. ఒక విధంగా బాధితులకు ఎంతో కొంత ఊరటను ఇస్తుందని భావించి పవర్ ఈ ప్రతిపాదన చేశారు.
అయితే పవన్ చేసిన ఈ ప్రతిపాదన ఏపీలోనే కాదు దేశంలోనే మొదటిది అని చెప్పాలని అంటున్నారు. చాలా చోట్ల ప్రభుత్వంలో తప్పులు జరిగినా ప్రజా ప్రతినిధులు కానీ కీలక స్థానాలలో ఉన్న వారు కానీ క్షమాపణలు చెప్పరు. అయితే పవన్ మాత్రం ఇతర దేశాలలో కొన్ని చోట్ల ఈ విధానం అమలులో ఉందని పిఠాపురం సభలో చెప్పారు.
దానిని ఏపీలో ఆయన అమలు చేయాలని కోరుకున్నారు. తనతోనే ప్రారంభించారు. మొత్తానికి పవన్ చెప్పిన విధంగా ఏపీలో క్షమాపణ పర్వం సాగింది. ఈ ఇష్యూతో పవన్ చెప్పాడంటే చేయాలంతే అన్నది బలపడుతోంది. పవన్ కళ్యాణ్ కూటమికి రాజకీయంగా కీలకం కావడంతో ఆయన మాట నెగ్గుతోంది అని అంటున్నారు.
ఏపీలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లోనూ పొత్తులతోనే ముందుకు సాగాలని చూస్తోంది. దానంతో పవన్ కళ్యాణ్ కి రాజకీయంగానే కాదు ప్రభుత్వ పరంగా ఎనలేని ప్రాధాన్యత దక్కుతోందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కూడా కూటమి తరఫున ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ హవా అయితే కూటమి ప్రభుత్వంలో గట్టిగానే సాగుతోందని అంటున్నారు.