తిరుమలలో 22 కోట్లతో ల్యాబ్... ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. కీలక నిర్ణయం!
ప్రస్తుతం తిరుమల లడ్డూపై నెలకొన్న వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Sep 2024 4:17 AM GMTప్రస్తుతం తిరుమల లడ్డూపై నెలకొన్న వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రక్షాళనతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఫుడ్ సే ఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ) సిద్ధమైంది. దీనికోసం రూ.22 కోట్లను కేటాయించింది.
అవును... తిరుమల మహా ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ ఆరోపణలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి హెల్త్ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో... ఈ హెల్త్ ల్యాబ్ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా తిరుమల అధికారులతో ఒప్పందం చేసుకోనుందని అంటున్నారు. వాస్తవానికి ప్రతీ ఏటా అన్నదానం, లడ్డూ, ఇతర అవసరాలకోసం రూ.800 కోట్లతో నెయ్యి సహా 30 నుంచి 40 రకాల వస్తువులను టీటీడీ కొనుగోలు చేస్తుంటుంది.
ఈ సమయంలో వీటి నాణ్యత పరిశీలను పటిష్టంగా చేయడానికి ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. అధికారులు ఆమోదం తెలిపారు. ఇందులో రూ.9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు.. రూ. 6 కోట్లతో బేసిక్ పరికరాలు.. రూ.5 కోట్లతో మైక్రో బయాలజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర వినియోగదారుల శాఖ రియాక్షన్ ఇదే!:
పవిత్రమైన తిరుమల లడ్డూ మహా ప్రసాదంలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల శాఖ స్పందించింది. ఇందులో భాగంగా... ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నివేదిక ఇచ్చిత అనంతరం మార్కెట్ లో ఉన్న నెయ్యి నాణ్యతను పరీక్షించే ప్రక్రియలో అదనపు చర్యలు తీసుకునే నిర్ణయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.