Begin typing your search above and press return to search.

గ్యాప్ ఇవ్వడం లేదు... మాల్దీవుల్లో ఇకపై సినిమా షూటింగ్స్ వద్దు!

మాల్దీవులలో షూటింగ్ చేయడానికి బదులుగా దేశంలోని అలాంటి ఇతర ప్రదేశాలలో సినిమాను చిత్రీకరించాలని, తద్వారా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని ఫిల్మ్ మేకర్స్ ను కోరింది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 5:53 AM GMT
గ్యాప్  ఇవ్వడం లేదు... మాల్దీవుల్లో ఇకపై సినిమా షూటింగ్స్  వద్దు!
X

ప్రస్తుతం భారత్ నుంచి మాల్దీవులకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది! ముగ్గురు మంత్రుల నోటి తీట ఆ దేశాన్ని పర్యాటకంగా భారీ దెబ్బ తీస్తుంది. ఇందులో భాగంగా ఇంతకాలం ఆ దేశానికి అన్నిరకాలుగానూ అండగా ఉన్న భారత్ నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది! ఇది వారి స్వయంకృతాపరాదమనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో తాజాగా ఎఫ్‎.డబ్ల్యూ.ఐ.సీ.ఈ. సైతం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... భారత్ పైనా, ప్రధానిపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిఫలాన్ని మాల్దీవులు స్పష్టంగా పొందుతున్నాయి! ఇందులో భాగంగా ఇప్పటికే "బాయ్ కాట్ మాల్దీవ్స్" ట్రెండ్ అవుతుండగా.. ఈస్ మై టిక్కెట్ సైతం షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో ఇప్పటికే మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న ఇండియన్ టూరిస్టులు సెకండ్ థాట్ కి వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతున్న నేపథ్యంలో మరో షాక్ తగిలింది.

ఇందులో భాగంగా... ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‎.డబ్ల్యూ.ఐ.సీ.ఈ.) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులో... మాల్దీవులను బహిష్కరించాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేసింది. మాల్దీవులలో షూటింగ్ చేయడానికి బదులుగా దేశంలోని అలాంటి ఇతర ప్రదేశాలలో సినిమాను చిత్రీకరించాలని, తద్వారా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని ఫిల్మ్ మేకర్స్ ను కోరింది.

ఇదే సమయంలో... ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన ప్రధాని మోడీకి సంబంధించి మాల్దీవుల మంత్రుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారంటూ ఎఫ్‎.డబ్ల్యూ.ఐ.సీ.ఈ. వాటిని ఖండిస్తోంది. అందుకే మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మాల్దీవుల లొకేషన్లకు బదులుగా దేశంలోనే ఆల్టర్నేటివ్స్ చూసుకుని అక్కడ షూటింగ్ చేయాలని తెలిపింది. భవిష్యతులో మాల్దీవులలో ఎటువంటి షూటింగ్ ప్లాన్ చేయవద్దని సూచించింది.

మరోపక్క లక్షద్వీప్‌ లో ప్రధాని మోడీ ఇటీవల చేపట్టిన పర్యటనతో ఈ దీవుల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో... భారత్‌ తో పాటు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టుల చూపు వీటిపై పడింది. దీంతో కేంద్రం లక్షద్వీప్‌ లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్కడ కొత్తగా మరో ఎయిర్‌ పోర్టు నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.