గడ్కరీ సొంత మేనిఫెస్టో.. మోడీని ఢీ కొడుతున్నట్టేనా?
ఆయన ఏం మాట్లాడితే అదే సిద్ధాంతం అన్నట్టుగా నాయకులు పాటించే పరిస్థితి కూడా వచ్చింది.
By: Tupaki Desk | 17 April 2024 8:03 AM GMTబీజేపీ అంటే.. ఒక సైద్ధాంతిక పార్టీ. దీనిలో ఎంతో మంది నాయకులు పనిచేశారు. వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా ఎంతో మంది పనిచేస్తున్నారు.. పదవులు కూడా అనుభవిస్తున్నారు. కానీ, ఒకప్పటి బీజేపీకి.. ఇప్ప టి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు పూర్తిగా ఆర్ ఎస్ ఎస్ భావజాలమే పార్టీని నడిపించింది. ఇదే రామమందిర ఉద్యమానికి, రథయాత్రకు శ్రీకారం చుట్టేలా చేసింది. కానీ, 2014 తర్వాత.. బీజేపీ అంటే.. మోడీ అనే భావన వ్యక్తమైంది. ఆయన చెప్పిందే... వేదం. ఆయన ఏం మాట్లాడితే అదే సిద్ధాంతం అన్నట్టుగా నాయకులు పాటించే పరిస్థితి కూడా వచ్చింది.
అయితే.. ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న నాయకులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. సాధ్వి ప్రజ్ఞానం ద , ఉమా భారతి వంటివారు.. ఆర్ ఎస్ ఎస్ నుంచిబీజేపీలోకి వచ్చారు. వీరు మోడీ ప్రభుత్వంలోనూ పనిచేసినా.. ఆయనతో అంటీముట్టనట్టే వ్యవహరించారు. ప్రస్తుత ఎన్నికల్లో వీరికి టికెట్ లు కూడా దక్కలేదు. అది వేరే సంగతి. ఇక, ఇదే ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో పార్టీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన వివాద రహిత నాయకుడు నితిన్ గడ్కరీ.
మోడీ తర్వాత.. ఈయనే కీలకమనే ప్రచారం 2016-18 మధ్య జోరుగా సాగింది. దీంతో అప్పటి వరకు.. ఉన్న కేబినెట్ హోదాను తీసేసి.. స్వతంత్ర మంత్రిగా ఆయన ను నియమించారు. అప్పటి నుంచి మోడీతో కలిసి ఆయన వేదిక పంచుకున్న సందర్బాలు కూడా లేవు. ఇక, ఈ వివాదం ఇప్పుడు మరింత మరింత ముదిరింది. ప్రస్తుత ఎన్నికల్లో నాగపూర్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న గడ్కరీ.. బీజేపీకి సమాంతరంగా సొంత మేనిఫెస్టో ఒకటి రూపొందించుకున్నారు. దీనిని ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఇది అసాధారణమేమీ కాదు. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి.. తన నియోజకవర్గానికి మాత్రమే ఇలాంటి సొంత మేనిఫెస్టోలు నాయకులు ఇవ్వడం సహజమే. కానీ, ఇక్కడ గడ్కరీ.. ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. ఒకవైపు.. బీజేపీ ఇప్పటికే మేనిఫెస్టో ఇచ్చింది. దీనిలో ఉద్యోగాలు అనే అంశం స్థానంలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేసింది. అంటే.. బ్యాంకు లనుంచి రుణాలు తీసుకుని నిరుద్యోగులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అంటే,, ప్రభుత్వ నియామకాలు లేనట్టే. ఇది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. దీనిని గమనించారో . ఏమో గడ్కరీ.. తన సొంత మేనిఫెస్టోలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని.. నాగపూర్‌ను మరింత పారిశ్రామికంగా డెవలప్ చేస్తానని హామీ గుప్పించారు. దీంతో ఇది మోడీని టార్గెట్ చేసేందుకే గడ్కరీ ప్రయత్నిస్తున్నా రన్న వాదన వినిపించేలా చేస్తోంది. మోడీ తర్వాత.. గడ్కరీనే కీలకమని అంటున్న వారిని మోడీ అదుపు చేయడం తన తర్వాత.. యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యను ఎంకరేజ్ వంటివి చర్చకు వచ్చిన నేపథ్యంలో గడ్కరీ సొంతగా వ్యవహరించడం.. మోడీని ఢీ కొడుతున్నారనే చర్చకు అవకాశం ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.