Begin typing your search above and press return to search.

ఏపీలోనే రీసౌండ్ చేసిన గాజువాక

హోరా హోరీ పోరు అని అంతా అనుకుని బరిలోకి దిగితే అది ఏకపక్షం పోరుగా మారింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 4:16 PM GMT
ఏపీలోనే రీసౌండ్ చేసిన గాజువాక
X

అదేమిటో గాజువాక అంటేనే కెవ్వు కేక మరి. ఆ రీసౌండ్ ఏపీ అంతా మోత మోగుతుంది. 2019లో పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేసినపుడు ఉన్న హడావుడి ఆ సౌండే వేరబ్బా అనుకుంటే ఇపుడు దానిని మించిన సౌండ్ చేసింది. హోరా హోరీ పోరు అని అంతా అనుకుని బరిలోకి దిగితే అది ఏకపక్షం పోరుగా మారింది.

ఏపీలో టీడీపీ కూటమి వార్ వన్ సైడ్ అన్నట్లుగా లాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేసింది. ఆ విజయ ప్రకంపనలు అంతటా మారుమోగాయి. అలా గాజువాకలో మెజారిటీ చూస్తే టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు ఏకంగా 94 వేల 58 ఓట్లుగా వచ్చింది.

ఇది ఏపీలోనే అత్యధిక మెజారిటీ అని అంటున్నారు. ఇంతటి మెజారిటీ ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు. ఆ ఘనతను పల్లా శ్రీనివాసరావు దక్కించుకున్నారు. ఇక రెండవ ప్లేస్ కూడా విశాఖ జిల్లాలోని భీమునిపట్నం దక్కించుకుంది. కూటమి తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు 92 వేల 401 ఓట్లు దక్కాయి.

ఆయన నామినేషన్ దాఖలు చేస్తూనే తన మెజారిటీ లక్షకు తగ్గదని ధీమాగా చెప్పారు. ఇపుడు దానికి దరిదాపులలో ఆయనకు వచ్చింది. భీమిలీ చరిత్రలో ఒకసారి 2014లో గంటాయే నలభై వేల దాకా భారీ మెజారిటీ సాధించారు. ఇపుడు దానిని తిరగరాస్తూ ఆయనే మరోసారి విజయ ఢంకా మోగించారు.

ఏపీలో తొంబై వేలను పై దాటిన మెజారిటీలు చాలా మందికి ఈసారి వచ్చాయి. అందులో నారా లోకేష్ కూడా 91 వేలను దాటారు. చాలా మందికి అద్భ్హుతమైన మెజారిటీలు రావడం విశేషం. అంతా కూడా అర లక్ష మెజారిటీలను ముప్పాతిక వేల మెజారిటీలను చాలా ఈజీగా తెచ్చేసుకున్నారు అంటే ఈసారి యాంటీ జగన్ ఫ్యాక్టర్ ఎంతలా పనిచేసింది అన్నది అర్ధం అవుతోంది అని అంటున్నారు.