Begin typing your search above and press return to search.

గల్లా అరుణకుమారి కేరాఫ్ చంద్రగిరి...రీ యాక్టివ్ వెనక కిరికిరి...?

గల్లా అరుణకుమారి. ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 12:10 PM GMT
గల్లా అరుణకుమారి కేరాఫ్ చంద్రగిరి...రీ యాక్టివ్ వెనక కిరికిరి...?
X

గల్లా అరుణకుమారి. ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆమె హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో రికార్డు క్రియేట్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆమె సొంత ఇలాకా. పదేళ్ల పాటు ఏకంగా మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ కి ఇష్టమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆమె కాంగ్రెస్ నుంచి వేరుపడి టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆమెకు 2014లో టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోయారు. ఆ తరువాత 2019లో పులవర్తి నానికి ఈ సీటుకు ఇచ్చినా ఆయన కూడా వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో ఓటమి పాలు అయ్యారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల తరువాత గల్లా అరుణ కుమారి రాజకీయాల పట్ల ఆసక్తిని చూపించడంలేదు. ఆమె ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటూ వచ్చారు. ఇక తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఆమె చంద్రబాబుకే చెప్పేశారు. ఆ మీదట ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. ఆమె మాత్రమే కాదు గుంటూరు ఎంపీగా ఉన్న ఆమె కుమారుడు గల్లా జయదేవ్ సైతం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఈసారి గుంటూరు ఎంపీకి వేరే క్యాండిడేట్ ని చూసుకోమని బాబుకు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

మొత్తానికి గల్లా ఫ్యామిలీ రాజకీయాలకు దూరం కాబోతోంది అని టాక్ అయితే ఉంది. ఇంతలో సడెన్ గా గల్లా అరుణ కుమారి చంద్రగిరిలో ప్రత్యక్షం అయ్యారు. ఆమె టీడీపీ క్యాడర్ తో మాట్లాడుతూ వారితో కలసి మెలసి తిరుగుతున్నారు. అంతే కాదు ఆమె రీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఆమె పొలిటికల్ గా రంగంలో ఉంటారన్న సంకేతాలు అయితే ఇస్తున్నారుట.

దీంతో చంద్రగిరి టీడీపీ పాలిటిక్స్ మారుతోంది అని అంటున్నారు. ఇప్పటిదాకా గల్లా అరుణ కుమారి రాజకీయంగా క్రియాశీలంగా లేకపోవడం వల్ల ఆమె వర్గం డల్ అయింది. అదే టైం లో పులవర్తి నాని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే క్యాండిడేట్ అని పాదయాత్రలో లోకేష్ ప్రకటించారు. దాంతో ఆయన జనంలో ఉంటున్నారు.

ఇపుడు గల్లా అరుణ కుమారి రంగంలోకి రావడంతో పోటీ పెరుగుతుందా నాని వర్సెస్ గల్లాగా టీడీపీలో సీన్ ఉంటుందా అన్న చర్చ అయితే వస్తోంది. కానీ గల్లా కనుక చంద్రగిరి నుంచి పోటీకి దిగితే పులవర్తి నాని నుంచి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు అని అంటున్నారు. అసలు ఆయన చూపు అంతా చిత్తూరు సీటు మీద ఉంది అని అంటున్నారు.

దాంతో గల్లా ఇక్కడ రీ ఎంట్రీ ఇస్తే కనుక ఆమెకే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సైతం ఓకే చెబుతారు అని అంటున్నారు. గల్లా ఫ్యామిలీకి మూడు తరాలుగా పట్టున్న సీటు కావడంతో పాటు ఆమె ముమ్మారు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. లక్కీ హ్యాండ్ కాబట్టి ఆమెని రంగంలోకి దింపితే పార్టీ గెలవడం ఖాయమని టీడీపీ లెక్కలేసుకోవచ్చు అని అంటున్నారు.

మొత్తానికి గల్లా రీ యాక్టివ్ అవుతున్నారని అంటున్నారు. మరి హ్యాట్రిక్ విజేత కావాలని చూస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇది ఎలాంటి పరిణామంగా ఉంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు.