Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి, గీతా గోవిందంలో ఆనంద్ దేవరకొండ ఏది చేస్తాడంటే..?

సినిమా గురించి హీరో హీరోయిన్ తో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఆర్టిస్టులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

By:  Tupaki Desk   |   24 May 2024 9:22 AM GMT
అర్జున్ రెడ్డి, గీతా గోవిందంలో ఆనంద్ దేవరకొండ ఏది చేస్తాడంటే..?
X

బేబీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ హీరోగా పెదకాపు ఫేం ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా ఉదయ్ శెట్టి డైరెక్షన్ లో వస్తున్న సినిమా గం గం గణేశా. మే 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీం తో తుపాకి.కాం స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. సినిమా గురించి హీరో హీరోయిన్ తో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఆర్టిస్టులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

యాంకర్ : గం గం గణేశా లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి..?

ఆనంద్ దేవరకొండ : అవును.. ఇదొక కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. నాది చాలా ఎనర్జిటిక్ క్యారెక్టర్. నేను చేసిన ఐదు సినిమాల్లో ఇదే చాలా హైప్ ఉంటుంది. చాలా ట్విస్ట్ లు ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం వినాయక చవితి చుట్టూ కథ తిరుగుతుంది.

యాంకర్ : సినిమాల్లోకి ఎలా వచ్చారు.

ప్రగతి : పబ్లిక్ పాలసీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత రాజ్యసభలో పని చేశా. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి.

యాంకర్ : మోడల్ గా చేశారా..?

ప్రగతి : అవును కొన్ని యాడ్స్ చేశాను. ఆ తర్వాత సినిమా ఛాన్స్ వచ్చింది.

యాంకర్ : ఇమ్మాన్యుయల్ గారు జబర్దస్త్ నుంచి మూవీస్ వరకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది..?

ఇమ్మాన్యుయల్ : వరైనా ఇండస్ట్రీకి వచ్చేదే వెండితెర మీద చూసుకోవాలనే.. టాలెంట్ నిరూపించుకోవడం కోసం జబర్దస్త్ లాంటి ఫ్లాట్ ఫామ్ మాకు ఉపయోగపడ్డాయి.

యాంకర్ : అవకాశాలు వస్తుంటే ఎలా అనిపిస్తుంది.. లైఫ్ ఎలా ఉంది..?

ఇమ్మాన్యుయేల్ : చాలా బాగుంది. ఈ సినిమా మొత్తం హీరో పక్కన ఉంటాను. ఈ సినిమా తర్వాత ఇంకా అవకాశాలు వస్తాయనుకుంటున్న.

యాంకర్ : కృష్ణ చైతన్య గారు మీ గురించి ఏమని చెబుతారు.. ఆడియన్స్ కి మీ పరిచయం..?

కృష్ణ చైతన్య : నటుడిగా కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో బెస్ట్ ఇచ్చాను. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించాలి.

యాంకర్ : స్క్రిప్ట్ సెలక్షన్ ఫస్ట్ నుంచి డిఫరెంట్ గా ఉన్నాయి.. దొరసాని, పుష్పక విమానం, బేబీ.. గం గం గణేశా చేయడానికి కారణం..?

ఆనంద్ దేవరకొండ : బేబీ ఇది రెండు ఒకేసారి షూట్ జరిగింది. ఈ జోనర్ ఇప్పటి వరకు చేయలేదు. ఆడియన్ గా ఇలాంటి సినిమాలు చూడటం ఇష్టం. అందుకే ఈ సినిమా చేశాను. అనుకున్న దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ చూస్తారు.

యాంకర్ : సత్యం రాజేష్, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. కామెడీ ఉంటుందా..?

ఆనంద్ దేవరకొండ : కామెడీ సాలిడ్ గా ఉంటుంది. ఇమ్మన్యుయల్ ఉన్నాడుగా.

యాంకర్ : మీ క్యారెక్టర్ ఏంటి..?

ఇమ్మాన్యుయల్ : హీరో ఫ్రెండ్.. అతను చేసినా సపోర్ట్ చేస్తాను.

యాంకర్ : గం గం గణేశాలో ఎలా ఛాన్స్ వచ్చింది..?

ప్రగతి : ఆనంద్ ఇంకా టీమ్ కలిసి హీరోయిన్ కోసం చూస్తున్నారు. నన్ను చూసి ఆడిషన్ లుక్ టెస్ట్ చేసి ఓకే చేశారు.

యాంకర్ : టీజర్ లో ద గర్ల్ నెక్స్ట్ డోర్ లా అనిపించింది. సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?

ప్రగతి : హాఫ్ శారీ అంటే ఇష్టం. ఈ సినిమాలో పాత్ర చాలా బాగుంటుంది. ఫన్, ట్విస్ట్ ఇలా అన్ని ఉంటాయి.

యాంకర్ : ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు అన్నారు. ఈ సినిమా చేయడానికి యూనిక్ పాయింట్..?

కృష్ణ చైతన్య : బ్రేక్ రాలేదని కాదు. చేసిన పాత్రల కన్నా ఇది ఎగ్జైట్ అనిపించింది. అందుకే చేశాను. చాలా వేరియేషన్స్ ఉన్న రోల్.. ఎంగేజ్ అవుతుంది.

యాంకర్ : కంప్లీట్ విలన్ రోల్ అనుకోవచ్చా..?

కృష్ణ చైతన్య : ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.రుద్ర పేరు ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో రోల్ అదే విధంగా ఉంటుంది.

యాంకర్ : ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ లో ఇది ఫస్ట్ యాక్షన్ మూవీ కదా..?

ఆనంద్ : ఇందులో యాక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

యాంకర్ : మూవీ రిలీజ్ కి ఎందుకు లేట్ అయ్యింది..? ఏమన్నా ఇంప్రవైజ్ చేశారా..?

ఆనంద్ : సిజీ వర్క్ వల్ల కాస్త లేట్ అయ్యింది. ఇందులో సిజీ ట్రిక్కిగా ఉంటుంది.

యాంకర్ : బేబీ సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుంది. కొత్త దర్శకుడితో రిస్క్ అనిపించలేదా..?

ఆనంద్ దేవరకొండ : లేదు.. 100 సినిమాలు చేసినా రిస్క్ రిస్కే కదా. అలా ఏమి లేదు. ఫస్ట్ డేనే ఆయన అనుకున్నది తీస్తున్నాడా అన్నది తెలిసిపోయింది. అతనికి క్లారిటీ ఉంది.

యాంకర్ : మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు..?

ప్రగతి : అలా ఒకరని కాదు.నేను అంతకముందు సినిమాలు చూడలేదు. నా సినిమాలు నేను చూస్తా. ప్రస్తుతం సాయి పల్లవి గారు, త్రిష గారిని ఇష్ట పడుతున్నా.. హిందీలో టబు ఆ తర్వాత సమంత ఇలా అందరు.

యాంకర్ : జబర్దస్త్, సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు.?

ఇమ్మాన్యూయల్ : జబర్దస్త్ కేవలం నెలలో వారం రోజులే ఉంటుంది. మిగతా 3 వారాలు ఖాళీనే. కానీ జబర్దస్త్ షెడ్యూల్ లోనే సినిమాలకు అడుగుతారు.

యాంకర్ : స్క్రీప్ట్ సెలక్షన్స్ లో బ్రదర్ అడ్వైస్ తీసుకుంటారా..? లేదా మీరే నిర్ణయం తీసుకుంటారా.?

ఆనంద్ దేవరకొండ : నా నిర్ణయమే..

యాంకర్ : బ్రదర్ ఒక పెద్ద స్టార్.. అతనితో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు..? వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు..?

ఆనంద్ : అంత సీరియస్ గా తీసుకోకూడదు.. బాగానే హ్యాండిల్ చేస్తున్నా.

యాంకర్ : కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగితుంది అనుకున్నారా..?

ఆనంద్ దేవరకొండ : ఇంటర్నెట్ లో అంతా జరుగుతుంది. నిజాలు ఉంటే పట్టించుకోవాలి.. ప్రతి ఒక్కరికి అలానే ఉంది. దాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు.

యాంకర్ : అర్జున్ రెడ్డి, గీతా గోవిందంలో మీకు వస్తే ఏది చేస్తారు..?

ఆనంద్ దేవరకొండ : ఇంటెన్స్ లవ్ స్టోరీ (అర్జున్ రెడ్డి)

యాంకర్ : గం గం గణేశా చూసేందుకు 3 రీజన్స్..?

ఆనంద్ దేవరకొండ : కచ్చితంగా కామెడీ, ట్విస్టులు, తెలుగులో ఇలాంటి జోనర్లు ఎక్కువగా రావు.