గన్నవరం-చీరాల.. రెండింటికీ పెద్ద తేడాలేదా..?
వచ్చే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
By: Tupaki Desk | 15 Aug 2023 11:30 PM GMTఅవును. వైసీపీలో ఇదే చర్చ సాగుతోంది. ఒకవైపు గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు.. వైసీపీకి కాక పుట్టిస్తున్నాయి. మరోవైపు.. చీరాలలో పైకి అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. ఇక్కడ పెను తుఫాను వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
గన్నవరం విషయానికి వస్తే.. ఆరు నూరైనా.. తనకే టికెట్ ఇవ్వాలని యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కావడం తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. నామినేటెడ్ పదవులు తనకు అవసరం లేదని అంటున్నారు. కానీ, గన్నవ రంలో వల్లభనేని వంశీ వైపే.. వైసీపీ చూపు ఉంది. ఇప్పటికే ఆయనను నియోజకవర్గం ఇంచార్జ్‌గా ప్రకటిం చారు.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి స్థానికంగా పరిస్థితులను మార్చాలని.. తనకు టికెట్ ప్రకటించాలని యార్ల గడ్డ డిమాండ్ చేస్తున్నారు. తేడా వస్తే.. ప్రజలే నిర్ణయిస్తారంటూ.. తన రాజకీయ వ్యూహాన్ని ఆయన చెప్ప కనే చెప్పారు.
ఇది.. వచ్చే ఎన్నికల నాటికి మరింత ముదిరితే.. వైసీపీని నష్టం చేకూరుస్తుందని అంటు న్నారు పరిశీలకులు. ఇక, చీరాల విషయానికి వస్తే.. ఇక్కడ పైకి ఎలాంటి హెచ్చరికలు, వార్నింగులు లేవు. అంతా సైలెంట్‌గా ఉంది.
కానీ, ఎన్నికలకు ముందు కనుక.. మార్పులు జరగకపోతే.. ఇక్కడ కూడా భారీ బాంబు పేలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల టికెట్ కోసం పట్టుబడుతున్నా రు. కానీ, ఆయనను పరుచూరుకు వెళ్లాలని పార్టీ చెబుతోంది.
ఇక, చీరాల టికెట్‌ను కరణం బలరాం తనయుడికే ఇవ్వనున్నట్టు ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆమంచి వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పరిణామాలు తనకు అనుకూలంగా మారకపోతే.. తనే ఒక నిర్ణయం తీసుకుని వైసీపీకి షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.