Begin typing your search above and press return to search.

వైసీపీ నేతల భూ కబ్జాల చిట్టా గంటా దగ్గర ఉందిట...!

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరింత ధాటీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 3:37 AM GMT
వైసీపీ నేతల భూ కబ్జాల చిట్టా గంటా దగ్గర ఉందిట...!
X

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరింత ధాటీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలలో రీ యాక్టివ్ అయిన తరువాత ఆయన ఎక్కడా తగ్గడంలేదు. ఇటీవల ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం కూడా పోయింది. ఎపుడో మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించేసి మాజీని చేసేశారు. దాని మీద గంటా మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవీ ఇవీ కలసి ఆయనలో రాజకీయ దూకుడు పెంచేశాయి. విశాఖలో భూములు అన్నీ వైసీపీ పెద్దలు వారి బినామీలు కలసి దోచుకున్నారు అంటూ గంటా మండిపడుతున్నారు. మీ భూ కబ్జా చిట్టా అంతా మా దగ్గర ఉంది. చర్చకు సిద్ధమా అని గంటా సవాల్ చేస్తున్నారు

ఎవరెవరు ఎంతెంత భూములు దోచుకున్నారు అన్నది లెక్కలతో సహా మా వద్ద డేటా ఉంది, చెప్పడానికి మేము రెడీ అని గంటా అంటున్నారు. విశాఖ మీద వైసీపీకి ఏ మాత్రం ప్రేమ లేదని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖ భూములను దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ విశాఖ అభివృద్ధి మీద లేదా అని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

విశాఖ రైల్వే జోన్ కి అవసరం అయిన యాభై మూడు ఎకరాల భూమిని కూడా ఇవ్వలేని ప్రభుత్వంగా వైసీపీ ఉందని అన్నారు. భూ కబ్జాలతో పెద్ద ఎత్తున భూములను దోచేసిన వారికి అండగా ఉండే వైసీపీ పెద్దలు దశాబ్దాల నాటి విశాఖ వాసుల కోరిక అయిన రైల్వే జోన్ ని సాకారం చేయడంలో మాత్రం నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర రైల్వే మంత్రి డీపీఆర్ కూడా రెడీ అయి రైల్వే జోన్ ఏర్పాటుకు అంతా సిద్ధంగా ఉందని చెబుతున్నారని, భూమి ఇవ్వకపోతే ఎక్కడ నిర్మాణం చేస్తామని ప్రశ్నిస్తున్నారని గంటా అంటున్నారు. విశాఖ మనోభావాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన అంటున్నారు.

వైసీపీలో రైల్వే జోన్ ఏర్పాటు కాకుండా వైసీపీ చేసిందని, ఆ విధంగా విశాఖ వాసుల సెంటిమెంట్ తో ఆడుకుంటోందని ఆయన విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలనే అందిపుచ్చుకుని గంటా మరో పవర్ ఫుల్ డైలాగ్ కూడా వాడారు.

వైసీపీ విముక్త విశాఖను చేసుకుంటామని ఆయన అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విశాఖలో ఎక్కడా గెలవదని ఆయన గట్టిగా చెబుతున్నారు. విశాఖ నుంచే వైసీపీ ఓటమి స్టార్ట్ అవుతోందని గంటా అంటున్నారు. గంటా చేసిన తీవ్ర ఆరోపణల మీద వైసీపీ రియాక్షన్ అంటో చూడాల్సి ఉంది. భూ కబ్జాలు వైసీపీ పెద్దలు చేశారా పెద్ద ఎత్తున భూములను దోచేశారా అన్న దాని మీద వైసీపీ ఏ రకంగా వివరణ ఇస్తుందో చూడాలని అంటున్నారు.