Begin typing your search above and press return to search.

జగన్ తోనే యుద్ధం అంటున్న గంటా...!

విశాఖకు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని లక్ష్యంగా చేసుకుని గత కొద్ది కాలంగా విమర్శలు దట్టిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:34 AM GMT
జగన్ తోనే యుద్ధం అంటున్న గంటా...!
X

విశాఖకు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని లక్ష్యంగా చేసుకుని గత కొద్ది కాలంగా విమర్శలు దట్టిస్తున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని ట్యాగ్ చేసి మరీ సీఎం గారూ అంటూనే ఘాటైన విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా వై ఏపీ హేట్ సీఎం జగన్ అంటూ ఏకంగా పోస్టర్ నే తయారు చేసి రిలీజ్ చేశారు.

అందులో నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిదో అన్నది ఒక్కో అంశాన్ని హైలెట్ చేస్తూ మధ్యలో జగన్ ఫోటో వేసి మరీ మీడియా ముందు రిలీజ్ చేశారు.

ఇన్ని తప్పులు చేసిన జగన్ని మళ్ళీ ఏపీ జనాలు ఎందుకు ఎన్నుకుంటారు అని ఆయన లాజిక్ తో కూడిన ప్రశ్న వేశారు. జగన్ నీడ్ ఏపీకి లేదని, ఆయనను జనాలు హేట్ చేస్తున్నారు అని గంటా అంటున్నారు. ఈ విషయాలని జగన్ ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇవన్నీ సరే కానీ గంటా మాజీ మంత్రి, 2019లో ఓడిన తరువాత ఆయన జగన్ మీద పెద్దగా విమర్శలు చేసినది లేదు. ఒక విధంగా చెప్పాలంటే సైలెంట్ గా ఉండేవారు. విశాఖకు రాజధాని అంటే చాలా మంచి నిర్ణయం అంటూ టీడీపీ అధినాయకత్వం పాలసీకి వ్యతిరేకంగా గళం విప్పి సంచలనం రేపారు.

ఆఖరుకు తన సొంత వియ్యకుడి మీద కేసులు పెట్టినా టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్న దాని మీద దాడి జరిగినా కూడా గంటా ఖండించలేదు అని ప్రత్యర్ధులు గుర్తు చేస్తున్నారు చంద్రబాబు నిండు అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకుని బయటకు వచ్చి మీడియా ముందు ఆవేదన చెందినా గంటా నుంచి పెద్దగా స్పందన అయితే రాలేదని కూడా అంటారు

అలాంటి గంటా ఇపుడు ధైర్యంగా జగన్ మీద విమర్శలు చేస్తూ దాదాపుగా ప్రతీ రోజూ బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఎన్నికల సీజన్ కాబట్టి అని అన్న వారూ ఉన్నారు. అంతే కాదు వైసీపీ ప్రభుత్వం గడువు ముగుస్తోంది ఇపుడు కొత్తగా కేసులు కూడా ఎవరి మీద పెట్టే సీన్ ఉండదు, పెట్టినా ఎన్నికల వేళ అది అడ్వాంటేజ్ అవుతుంది అని భావించే ఈ విధంగా ఎదురు దాడి వ్యూహాన్ని ఎంచుకున్నారు అని అంటునారు.

మరి కొందరు అయితే గంటా జిల్లా నేత కాదని స్టేట్ లీడర్ అని ప్రొజెక్ట్ చెసుకొవడానికే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. 2019 ఎన్నికల తరువాత చాలా సార్లు టీడీపీ అధినాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన గంటా ఒక దశలో ఎవరికీ చెప్పా పెట్టకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి కూడా సంచలనం రేపారు.

ఆయన పార్టీలో ఉంటారా ఉండరా అన్న చర్చ వచ్చినా కూడా నోరు విప్పలేదు. పార్టీ కష్టకాలంలో గంటా వ్యవహరించిన తీరుతో హై కమాండ్ అయితే గుర్రుగా ఉంది అని అంటున్నారు. అందుకే ఇపుడు గంటా తన మొత్తం సత్తాను చూపిస్తున్నారు అని అంటున్నారు. జగన్ని నేరుగా ఢీ కొడుతూ వస్తున్నారు. ఆ విధంగా టీడీపీ పెద్దల వద్ద మార్కులు కూడా పడతాయని సీఎం ని విమర్శితే ఆ స్థాయిలో తన ఇమేజ్ కూడా బిల్డప్ అవుతుందని ఇలా అన్ని విధాలుగా ఆలోచించే గంటా సీఎం గారూ అంటూ విమర్శిస్తున్నారు అని అంటున్నారు.

అయితే గంటాలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడా హుందా తనం కోల్పోవడంలేదు. ముఖ్యమంత్రి గారూ అంటూనే విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా ఆయన ప్రజా సమస్యలు లేవనెత్తడం వల్ల వైసీపీ సైతం ఆయన్ని ఏమీ అనలేని పరిస్థితి ఉంది అంటున్నారు. మొత్తానికి తన పాతికేళ్ల రాజకీయ చాతుర్యాన్ని గంటా బాగానే ఉపయోగిస్తున్నారు అని అంటున్నారు.