గంటా ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారంటే....!?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ కెరీర్ కి పాతికేళ్ల పైబడి వయసు ఉంది
By: Tupaki Desk | 14 Jan 2024 12:41 PM GMTమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ కెరీర్ కి పాతికేళ్ల పైబడి వయసు ఉంది. ఆయన 1999లో తొలిసారిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన వస్తూనే అనకాపల్లి వంటి పొలిటికల్ గా ప్రెస్టేజ్ ఉన్న ఎంపీ సీటుకే గురి పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతో గెలిచి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
ఇక ఆ తరువాత ఆయనకు రాజకీయంగా ఎదురులేకపోయింది. 2004 వచ్చేసరికి గంటా శ్రీనివాసరావు చోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. 2009లో అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2014ఓ భీమునిపట్నం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేసి జగన్ వేవ్ లో కూడా గెలిచారు
ఇపుడు గంటా ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు అన్నది పెద్ద చర్చగా ఉంది. గంటా ప్రతీ ఎన్నికకూ నియోజకవర్గాన్ని పార్టీని మారుస్తారు అని పేరు. అయితే 2019లో మాత్రం పార్టీని మార్చే దానికి గంటా బ్రేక్ వేశారు. కానీ నియోజకవర్గం మార్చే సక్సెస్ మంత్రను కంటిన్యూ చేశారు.
దీంతో ఈసారి గంటా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే దీని మీద అనెక రకాలైన ప్రచారం సాగుతోంది. గంటా భీమిలీ నుంచి పోటీ చేస్తారని కొందరు అంటే ఆయన చోడవరం నుంచి చేస్తారు అని మరి కొందరు అంటున్నారు.
దీని మీద భోగీ పండుగ వేళ గంటా తన మనసులో మాట చెప్పేశారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తనకు స్పష్టత ఉందని తేల్చేశారు. ఇక అధినాయకత్వానికి కూడా తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా బాగా తెలుసు అన్నారు. అంటే గంటా ఎక్కడ నుంచి పోటీ చేస్తారో సరైన టైం లోనే రివీల్ చేస్తారు అన్న మాట.
ఒక్క మాట మాత్రం వాస్తవం అంటున్నారు. గంటా ఈసారి కచ్చితంగా విశాఖ నార్త్ నుంచి అయితే పోటీలో ఉండరని అంటున్నారు. గంటా కూడా గడచిన నాలుగేళ్ళ కాలంలో ఉత్తర నియోజకవర్గంలో పెద్దగా తిరిగింది లేదు అని అంటున్నారు. దాంతో పాటు ఆయన ఈసారి ఎక్కువగా భీమిలీ మీదనే మక్కువ పడుతున్నారు అని అంటున్నారు
గంటాకు భీమిలీ ఇస్తే విశాఖ ఎంపీ సీటు విషయంలో ఆయన పార్టీ గెలిచేందుకు అవసరం అయిన మెజారిటీని తీసుకుని వస్తారు అని అధినాయకత్వం లెక్కలు వేస్తోంది అని అంటున్నారు. ఇక్కడ జనసేన కూడా సీటు కోరుతోంది. అయితే గంటా వంటి బిగ్ షాట్ పోటీకి దిగాలనుకుంటే ఇదేమీ అడ్డు కాదు అని అంటున్నారు. సో నూటికి తొంబై తొమ్మిది శాతం మాత్రం గంటా భీమిలీ నుంచి పోటీ చేయడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.