Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేనల మధ్య గ్యాప్....ఏం జరగబోతోంది...!?

ఏపీలో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. మరో వైపు అధికార వైసీపీ చకచకా తన అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. ఎక్కడికక్కడ మార్పులు చేస్తోంది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 3:41 AM GMT
టీడీపీ జనసేనల మధ్య గ్యాప్....ఏం జరగబోతోంది...!?
X

ఏపీలో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. మరో వైపు అధికార వైసీపీ చకచకా తన అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. ఎక్కడికక్కడ మార్పులు చేస్తోంది. ఇక విపక్ష తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు ఉన్నా కూడా అభ్యర్ధుల విషయం తేల్చడం లేదు. అంతే కాదు ఉమ్మడి మ్యానిఫేస్టో విషయంలో ఇంకా ఏమీ జరగడంలేదు.


దీంతోనే పవన్ కళ్యాణ్ యువగళం సభకు దూరంగా ఉన్నారా అన్న చర్చ బయటకు వస్తోంది. ఒక విధంగా పవన్ ఫస్ట్ టైం తన రాజకీయ వ్యూహాన్ని అలా అమలు చేశారు అని అంటున్నారు. టీడీపీ తన మాటను ఎంతవరకు గౌరవిస్తుంది అన్నది పవన్ తెలుసుకోవడానికే ఈ విధంగా వ్యవహరించారా అన్నదే చర్చగా ఉంది.

చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి నెలన్నర పైగా జరిగిపోయింది. అదే టైంలో చంద్రబాబు పవన్ ఇద్దరూ రెండు సార్లు భేటీ అయ్యారు. ఇక తొలి విడత జాబితా రిలీజ్ చేద్దామని పవన్ చంద్రబాబుతో చెప్పారని అంటున్నారు అలాగే తమ పార్టీకి యాభై దాకా సీట్లు ఇవ్వాలని కూడా పవన్ కోరినట్లుగా తెలుస్తోంది.

అయితే దానికి టీడీపీ నుంచి ఇంకా ఏ రకమైన జవాబు రాలేదని అంటున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు బీజేపీని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు అని అంటున్నారు ఆయన బీజేపీ కోసం వేచి చూద్దామని అంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీలో ఎన్నికలు చూస్తే మార్చిలో జరుగుతాయని అంటున్నారు.

అంటే కచ్చితంగా మూడు నెలలు కూడా లేవు. మరి ఇప్పటి నుంచే అభ్యర్ధులను ఖరారు చేసుకుని జనాలలోకి వెళ్లకపోతే తీవ్రంగా నష్టపోతామని పవన్ అంటున్నట్టుగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు చాలా రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. ఒక వైపు బీజేపీతో పొత్తులు కొలిక్కి రావాలని చూస్తున్నారు.

అదే టైం లో వైసీపీ నుంచి పెద్ద నంబర్ లో బయటకు ఎవరైనా నేతలు వస్తే వారిని చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇలా బాబు వేచి చూసే ధోరణితోనే కొంత అసహనంతో పవన్ యువగళం పాదయాత్ర ముగింపునకు డుమ్మా కొట్టారు అని అంటున్నారు.

అంతే కాదు యాభై సీట్లు జనసేన కోరితే టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది ఈ రోజుకీ ఖాయం లేదు టీడీపీ అయితే ఇరవై దాకా ఇవ్వవచ్చు అని అంటున్నారు. లేకపోతే పాతికతో ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అని అంటున్నారు. ఇక ఇచ్చే సీట్లు కూడా జనసేన కోరుకున్న చోట బలమున్న చోట కాకుండా తాము అనుకున్న చోటనే ఇస్తారు అని ప్రచారం సాగుతోంది.

దాంతోనే జనసేనలో కొంత ఆగ్రహం కనిపిస్తోంది అని అంటున్నారు. అన్నింటికీ సంబంధించి టీడీపీ అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికే పవన్ ఇలా చేశారు అని అంటున్నారు. అయితే జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఈ రోజుకీ సిద్ధంగా లేదు అని అంటున్నారు. ఇక టీడీపీకి గ్రాఫ్ పెరిగింది అని నమ్మకం మీద ఆ పార్టీ హై కమాండ్ ఉంది. దాంతో ఏదో విధంగా పొత్తుల విషయం కధ ముందుకు సాగిద్దామని చూస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా కొంత గ్యాప్ అయితే రెండు పార్టీల మధ్యన ఉంది అని అంటున్నారు. చూడాలి మరి అసలు విషయం ఏమిటి అన్నది.