Begin typing your search above and press return to search.

గ్యాస్ వినియోగదారులపై దీపావళికి బాంబు పేల్చిన కేంద్రం!

ఇందులో భాగంగా... వంటగ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.

By:  Tupaki Desk   |   1 Nov 2024 9:41 AM GMT
గ్యాస్  వినియోగదారులపై దీపావళికి బాంబు పేల్చిన కేంద్రం!
X

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రజలంతా ఈ వేడుకను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సమయంలో సందట్లో సడేమియా అన్నట్లుగా కేంద్రం ఓ భారీ బాంబు పేల్చింది! ఇందులో భాగంగా... వంటగ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.

అవును... ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుతుతున్నాయి. ఈ దీపావళి వేళ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. మరోపక్క.. కేంద్రం మాత్రం ఈ గ్యాస్ విషయంలో వినియోగదారులకు షాకిచ్చింది. ఇందులో భాగంగా 19 కేజీల సిలిండర్ ధరలను భారీగా పెంచింది!

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఈ సిలిండర్ పై అదనంగా రూ.62 పెంచింది. పెంచిన ధరలను నవంబర్ 1 నుంచే అమలుచేస్తోంది! ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే చమురు కంపెనీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. దీంతో... కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉన్న చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని అంటున్నారు!

ఈ నేపథ్యంలో... దేశ రాజధానిలో నిన్నటివరకూ రూ.1,740గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,802 కు పెరిగింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ధర రూ.1,692.50 నుంచి రూ.1,754.50కి పెరిగింది. ఇక, కోల్ కతా లో ధర రూ.1,850.50 నుంచి రూ.1,911.50 కి చేరింది.

కాగా.. నాలుగు నెలల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. ఆగస్టులో సిలిండర్ ధర రూ.8.50 పెరగగా.. సెప్టెంబర్ లో రూ.39.. అక్టోబరులో రూ.48.50 చొప్పున వినియోగదారులపై భారం పడగా.. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని అన్నట్లుగా నవంబర్ 1 నుంచి రూ.62 చొప్పున ధర పెరిగింది!