Begin typing your search above and press return to search.

విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌.. అస్వస్థతకు గురి అయిన 39 మంది ప్రయాణికులు..

అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడంతో గ్యాస్ లీకేజ్ను కట్టడి చేయగలరు.

By:  Tupaki Desk   |   5 July 2024 10:08 AM GMT
విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌.. అస్వస్థతకు గురి అయిన 39 మంది ప్రయాణికులు..
X

మలేషియాలోని కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌ అవ్వడంతో సుమారు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురి అయ్యారు. అధికారుల వివరాల ప్రకారం.. నిన్న (స్థానిక కాలమానం ప్రకారం)ఉదయం 11 గంటల 23 నిముషాలకు ఈ సంఘటన చోటుచేసుకుంది.కౌలాలంపూర్‌ ఎయిర్పోర్టులోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ ఫెసిలిటీ వద్ద ఈ గ్యాస్ లీక్ జరిగింది.

అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడంతో గ్యాస్ లీకేజ్ను కట్టడి చేయగలరు. అప్పటికే ఈ గ్యాస్ లీకేజీ కారణంగా సుమారు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురి అయ్యారు. ఇందులో 14 మందిని చికిత్స కోసం వెంటనే ఎయిర్పోర్ట్ డిజాస్టర్ యూనిట్ కి పంపించామని.. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. గ్యాస్ లీక్ అయినట్లుగా సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్నిమాపక విభాగం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఎంతో చాకచక్యంగా పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

అస్వస్థతకు గురి అయిన ప్రయాణికులలో ఒకరు మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే నివేదికల ప్రకారం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎయిర్ పోర్ట్ లో లీక్ అయిన గ్లాస్ మిథైల్‌ మెర్‌కాప్టాన్‌గా గుర్తించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు అని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ స్పష్టం చేశారు.ఈ సంఘటన నేపథ్యంలో విమానం రాకపోకల సమయాలలో ఎటువంటి మార్పులు ఉండవు అంటూ అధికారులు స్పష్టం చేశారు.

ఉదయం సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ వద్ద కెమికల్ గ్యాస్ లీకేజీ గురించి అత్యవసర కాల్ రావడంతో ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని కూడా పంపించినట్టు అగ్నిమాపక విభాగం వెల్లడించింది.ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యం వేరుగా ఉన్నందువల్ల ఎక్కువగా అక్కడ మూడు కంపెనీలలో పని చేస్తున్న వ్యక్తులు గ్యాస్ బారిన పడ్డారు. ఈ లీకేజీ కి సంబంధించి దర్యాప్తు చేపట్టారు.