Begin typing your search above and press return to search.

రూ. 500 రాయితీ సబ్సిడీ అర్హులెవరు? విధి విధానాలేంటంటే?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రూ.500లకు సిలిండర్ కూడా ఒకటి. దీంతో ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 8:34 AM GMT
రూ. 500 రాయితీ సబ్సిడీ అర్హులెవరు? విధి విధానాలేంటంటే?
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రూ.500లకు సిలిండర్ కూడా ఒకటి. దీంతో ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 గ్యాస్ పంపిణీ పథకం అమలు కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో విధి విధానాలు ఖరారు చేస్తోంది. లబ్ధిదారుల గుర్తింపు, సిలిండర్లు అందజేత అంశంపై చర్చలు జరుపుతోంది.

మహాలక్ష్మి పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లకు రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సబ్సిడీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చేయడానికే ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదన తీసుకురానున్నట్లు సమాచారం. సబ్సిడీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలనేదే ప్రభుత్వ ఆలోచన. దీని కోసం అక్రమార్గాలకు చెక్ పెట్టాలని ఆలోచిస్తోంది.

తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్లు 1.20 కోట్లు ఉన్నాయి. ఇందులో 4 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుతో అనుసంధానమైనవి 63 లక్షల వరకు ఉన్నాయి. ఉజ్వల జ్యోతి పథకం లబ్ధిదారులకు రూ.340 రాయితీ వస్తోంది. ఇందులో 11 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.

ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి? సంవత్సరానికి ఆరు ఇవ్వాలా? లేక 12 ఇవ్వాలా? అనే ఆలోచనలో ప్రభుత్వం పడింది. ప్రతి నెల సిలిండర్లు వాడే వారి సంఖ్య రాష్ట్రంలో 44 శాతం మాత్రమే ఉంది. డిసెంబర్ 28 నుంచి ఈ పథకం ప్రారంభించింది. ఈ మేరకు దరఖాస్తులు తీసుకుంటోంది. ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో లబ్ధిదారుల్లో సందిగ్ధత నెలకొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 లకే గ్యాస్ కనెక్షన్ పథకంలో అందరిని భాగస్వాములను చేసి వారికి రాయితీపై సిలిండర్లు అందజేయాలని చూస్తోంది. దీనికి గాను మార్గదర్శకాలు జారీ చేస్తోంది. రాయితీ గ్యాస్ పథకం కూడా విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని కోసం పలు మార్గాలు అన్వేషిస్తోంది. దీంతో రాయితీ గ్యాస్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు చూస్తున్నారు.