Begin typing your search above and press return to search.

హ్యాండ్ గన్ సృష్టికర్త గాస్టన్ గ్లాక్ కన్నుమూత!

తాజాగా ఆస్ట్రియాకు చెందిన గ్లాక్ కంపెనీ తన వెబ్‌ సైట్‌ లో కారణం కానీ, ఇతర వివరాలను కానీ తెలియజేయకుండా అతని మరణాన్ని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 9:48 AM GMT
హ్యాండ్  గన్  సృష్టికర్త  గాస్టన్  గ్లాక్  కన్నుమూత!
X

తూపాకీ వాడకం అనుమతి ఉన్నవాళ్లు, లేనివాళ్లూ కూడా ఎక్కువగా వాడేది హ్యాండ్ గన్! దీని సృష్టికర్త మరణించారు! గ్లాక్ చేతి తుపాకీని కనిపెట్టిన ఆస్ట్రియన్ ఇంజనీర్ గాస్టన్ గ్లాక్ (94) మరణించారు. తాజాగా ఆస్ట్రియాకు చెందిన గ్లాక్ కంపెనీ తన వెబ్‌ సైట్‌ లో కారణం కానీ, ఇతర వివరాలను కానీ తెలియజేయకుండా అతని మరణాన్ని వెల్లడించింది.

అవును... గ్లాక్ హ్యాండ్ గన్ ని కనిపెట్టిన గాస్టన్ గ్లాక్ మరణించారు. సోషల్ మీడియా ఇంత విస్తరించినా కూడా ఇతనికి సంబంధించిన వివరాలేవీ పెద్దగా బయట ప్రపంచానికి తెలియకపోవడం గమనార్హం. ఇతను వీలైనంత వరకూ వార్తల్లో నిలవకుండా ఏకాతంగా గడుపుతారని అంటుంటారు. అందుకే... ఆస్ట్రియాలోని లేక్ ఫ్రంట్ ఎస్టేట్‌ లో ఏకాంతంగా ఎక్కువ సమయం గడిపిన బిలియనీర్‌ గా ఇతడిని అభివర్ణిస్తుంటారు.

1929లో జన్మించిన గ్లోక్.. వియన్నాలోని ఓ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత ఆస్ట్రియా రాజధాని వెలుపల ఒక పట్టణంలో వినియోగ వస్తువుల వ్యాపారాన్ని స్థాపించాడు. ఈ క్రమంలో 1963లో గ్లాక్ కంపెనీని స్థాపించగా.. 1980 ప్రారంభంలో ఈ వ్యాపారం సైనిక సామాగ్రిగా మారింది. ఇందులో భాగంగా గ్లోక్.. తేలికైన 9-మిల్లీమీటర్ల సెమీ ఆటోమెటిక్ హ్యాండ్‌ గన్‌ ను రూపొందించి, పేటెంట్ పొందారు.

ఇక గ్లాక్ వ్యక్తిగత జీవిత విషయనికొస్తే... గ్లోక్ 1962లో అతని మొదటి భార్య హెల్గాను వివాహం చేసుకున్నారు. అనంతరం 2011లో (అప్పటికి గ్లాక్ వయసు 82 ఏళ్లు) వీరు విడాకులు తీసుకున్నారు. హెల్గా దాఖలు చేసిన దావా ప్రకారం... వారికి బ్రిగిట్టే, గాస్టన్ జూనియర్, రాబర్ట్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత 2012లో 31ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నట్లు కథనాలొచ్చాయి!

ఈ క్రమంలో 2017లో ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా గ్లాక్ అమ్మకాలను $500 మిలియన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ఇదే సమయంలో... యునైటెడ్ స్టేట్స్‌ లో విక్రయించబడిన హ్యాండ్ గన్స్ మార్కెట్ వాటా 65 శాతంగా ఉందని చెబుతారు. ఇదే క్రమంలో... 2021లో ఫోర్బ్స్.. మిస్టర్ గ్లాక్ వ్యక్తిగత సంపదను $1.1 బిలియన్లుగా అంచనా వేసింది.