ఆ విషయంలో పెద్దల చేతులు జనరేషన్ ఆల్ఫా, జడ్ ల చేతుల్లోనే..!
అయితే.. ప్రస్తుత కాలంలో ఓ విషయంలో మాత్రం నిర్ణయం జనరేషన్ ఆల్ఫా (14 ఏళ్ల లోపు చిన్నారులు), జనరేషన్ జడ్ (27 ఏళ్ల లోపు యువతీ యువకులు) తీసుకుంటున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 1 Oct 2024 6:45 PM GMTసాధారణంగా ఇంట్లో సుమారుగా అన్ని నిర్ణయాలూ పెద్దలే తీసుకుంటుంటారు! మెజారిటీ విషయాల్లో పిల్లల తరుపున నిర్ణయాలు వారి వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెద్దలే తీసుకుంటుంటారు! అయితే.. ప్రస్తుత కాలంలో ఓ విషయంలో మాత్రం నిర్ణయం జనరేషన్ ఆల్ఫా (14 ఏళ్ల లోపు చిన్నారులు), జనరేషన్ జడ్ (27 ఏళ్ల లోపు యువతీ యువకులు) తీసుకుంటున్నారని అంటున్నారు.
అవును... మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే.. విహారయాత్రలకు వెళ్లే విషయంలో ఇంట్లోని 14 ఏళ్ల లోపు పిల్లలు, 27 ఏళ్ల లోపు యువతీ యువకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఈ విషయంలో వీరి ఆసక్తులకే ప్రధాన్యం ఉంటోందని అంటున్నారు. ఈ మేరకు తాజాగా ఓ సర్వే ఈ విషయాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా ప్రధానంగా భారత్ లో కుంటుంబ విహార యాత్రల విషయంలో 93 శాతం ప్రణాళికలు రూపొందించే విషయంలో చురుకైన పాత్ర పోషించేది యువకులే అని, విహార యాత్రల విషయంలో వారే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ సర్వే వెల్లడించింది. విహారయాత్రల్లో కార్యక్రమాలపై పిల్లల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే వెల్లడించింది!
ప్రధానంగా... 70 శాతం మంది భారతీయ తల్లితండ్రులు, అంతర్జాతీయంగా 70 శాతం మంది తల్లితండ్రులు ఈ విహారయాత్రల విషయంలో పిల్లల ఇష్టాఇష్టాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. “స్మాల్ వాయిసెస్, బిగ్ ఛాయిసెస్: హిల్టన్ 2025 ట్రావెల్ రిపోర్ట్” అభిప్రాయపడింది. విహారయాత్రల విషయంలో ఆసక్తితో ఉన్న భారతీయ యువత ఏడాదికి రెండు నుంచి మూడు టూర్లకు వెళ్తున్నట్లు తెలిపింది.