Begin typing your search above and press return to search.

ప్రేమ కోసం లింగమార్పిడి... కట్ చేస్తే కథ ఇది!

ఈ మధ్య కాలంలో ఇద్దరు యువకుల మధ్య, ఇద్దరు యువతుల మధ్య ప్రేమ చిగురిస్తున్న ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Feb 2024 3:24 PM GMT
ప్రేమ కోసం లింగమార్పిడి... కట్ చేస్తే కథ ఇది!
X

ఈ మధ్య కాలంలో ఇద్దరు యువకుల మధ్య, ఇద్దరు యువతుల మధ్య ప్రేమ చిగురిస్తున్న ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాహాలకు సంబంధించిన చట్టబద్ధతపైనా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ.. తదనంతరం జరిగిన పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రేమ కథ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

అవును... ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. దీంతో తన స్నేహితుడిని వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఫలితంగా.. పురుషుడైన తన స్నేహితుడికోసం అమ్మాయిగా మారాడు. కట్ చేస్తే... అప్పుడు మొదలైంది అసలు కథ! ఇందులో భాగంగా... లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా మారిన స్నేహితుడిని పెళ్లాడేందుకు యువకుడు నిరాకరించడంతో కథ పోలీస్ స్టేషన్‌ కు చేరుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... ఇండోర్‌ కు చెందిన 28 ఏళ్ల యువకుడికి ఉత్తరప్రదేశ్‌ కు చెందిన వైభవ్ శుక్లా అనే యువకుడితో 2021లో సోషల్ మీడియాలో పరిచయమైంది. ఆ స్నేహం మరింత పెరిగింది. అదికాస్తా ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమకు దారితీసింది. ఒకరిని ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో... లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడానికి ఇండోర్ కు చెందిన యువకుడు సిద్ధపడ్డాడు. ఇకపై జీవితం అంతా కలిసే ఉండొచ్చని భావించారు.

కట్ చేస్తే... ఆ తర్వాత వైభవ్ శుక్లా మాట మార్చాడట. ఇందులో భాగంగా ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిన స్నేహితుడితో పెళ్లికి నిరాకరించాడట. ఇలా పెళ్లి చేసుకుంటానన్న మిత్రుడు ఆపరేషన్ అనంతరం మోసం చేయడంతో బాధితుడు మరోదారి లేక విజయ్ నగర్ పోలీసులను ఆశ్రయించి.. వైభవ్ శుక్లాపై ఫిర్యాదు చేశాడని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో నమ్మి ఆపరేషన్ చేయించుకున్నానని.. దీనికోసం లక్షల రూపాయలు ఖర్చు చేశానని.. ఇప్పుడేమో తనను పెళ్లి చేసుకునేది లేదని చెబుతున్నాడని పేర్కొంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది! ఇదే సమయంలో ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు.

దీంతో... నిందితుడు వైభవ్ శుక్లాపై సెక్షన్ 377 (అసహజ శృంగారం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసిన పోలీసులు... అతడి కోసం గాలిస్తున్నారని తెలుస్తుంది.