''డిజిటల్ కండోమ్'' వచ్చేసింది.. ఏమిటిది.. ఎలా పనిచేస్తోంది?
ఇది స్మార్ట్ ఫోన్ లు సెక్స్ సమయంలో ఆడియో లేదా వీడియోను రికార్డ్ చేయకుండా నిరోధిస్తుంది.
By: Tupaki Desk | 27 Oct 2024 11:29 AM GMTఒక జర్మనీ లైంగిక ఆరోగ్య బ్రాండ్, బిల్లీ బాయ్, సన్నిహిత క్షణాలలో ఏకాభిప్రాయం లేని రికార్డింగ్ ను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని ప్రారంభించింది. “కాండోమ్” అని పిలువబడే ఈ యాప్ "డిజిటల్ కండోమ్" గా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ లు సెక్స్ సమయంలో ఆడియో లేదా వీడియోను రికార్డ్ చేయకుండా నిరోధిస్తుంది.
అవును... సంభోగం సమయాల్లో అనధికారికంగా ఆడియో, వీడియో రికార్డులు కాకుండా రహస్యంగా ఉంచిన ఎలక్ట్రానిక్స్ డివైజ్ ల కట్టడికి జర్మనీకి చెందిన ఓ సంస్థ డిజిటల్ కండోమ్ యాప్ ను ప్రవేశపెట్టింది. అయితే... లైంగిక చర్యల్లో పాల్గొనే ముందు ఈ యాక్టివ్ చేసుకుని వర్చువల్ బటన్ స్వైప్ చేస్తే ఆడియో, వీడియో డివైజ్ లను బ్లూటూత్ ద్వారా బ్లాక్ చేస్తుంది.
ఇలా అనధికార రికార్డింగ్ ల నుంచి రక్షణను అందిస్తుంది. ఈ నేపథ్యంలో... "నిజమైన కండోమ్ ను ఉపయోగించేటంత సులభం" అనే ట్యాగ్ లైన్ తో ఈ ప్రోడక్ట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చలను రేకెత్తించింది.
ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ... సన్నిహిత కార్యచరణకు ముందు వినియోగదారులు ఇద్దరూ తమ స్మార్ట్ ఫోన్ లను సమీపంలో ఉంచుతారు.. అనంతరం, అన్ని కెమెరాలు, మైక్రోఫోన్ లను బ్లాక్ చేయడానికి వర్చువల్ బటన్ ను స్వైప్ చేస్తారు. ఈ సమయంలో ఒక ఫోన్ బ్లాక్ నుంచి వైదొలగడానికి ప్రయత్నిస్తే ఓ అలర్ట్ సౌండ్ వస్తుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో... "ఇది ఏకకాలంలో అవసరమైనన్ని పరికరాలను బ్లాక్ చేయగలదు" అని తెలిపింది. ఇదే క్రమంలో స్పందించిన ఇన్నోసియన్ బెర్లిన్ సీసీఓ గాబ్రియేల్... ఈ యాప్ ను సృష్టించడం వెనుక సామాజిక బాధ్యత ఉందని అన్నారు. క్లయింట్ ల కోసం మాత్రమే కాకుండా.. సమాజం కోసం కూడా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.