భారతీయులకు భారీ గుడ్ న్యూస్... టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థ బిగ్ ఆఫర్!
తమ దేశంలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.
By: Tupaki Desk | 24 Oct 2024 3:53 AM GMTవిదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని చాలా మంది భావిస్తుంటారు. చిన్నదో, పెద్దదో.. విదేశాల్లో జాబ్ అంటే ఫ్యూచర్ మరింత బాగుంటుందని భావిస్తుంటారు. ఆర్థికంగా బలమైన దేశాల్లో అవకాశాల కోసం చూస్తుంటారు. ఈ సమయంలో... తమ దేశంలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.
అవును... జర్మనీలో జాబ్ చేయాలనుకునే భారతీయులకు తాజాగా భారీ గుడ్ న్యూస్ వచ్చింది. భారతీయ కార్మికులకు ఇచ్చే స్కిల్డ్ లేబర్ వీసాలను భారీగా పెంచుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం 20,000 గా ఉండే నైపుణ్యం కలిగిన లేబర్ వీసాల సంఖ్యను ఏటా 90,000 పెంచాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది.
ఈ మేరకు భారత్ లోని జర్మన్ రాయభారి ఫిలిప్ అకెర్ మాన్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... జర్మనీ ప్రస్తుతం కార్మికుల కొరతను ఎదుర్కోంటుందని. ఈ సమయంలో... ప్రధానంగా ఐటీ, సంరక్షణ, నర్సింగ్ రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వీసాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు
ఆ సంగతి అలా ఉంటే... గత ఏడాది న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాల్లో జరిగిన చర్చల మెరకు.. భారత్, జర్మనీలు మరికొన్ని రోజుల్లో లేబర్ మొబిలిటీ అండ్ స్కిల్ రికగిషన్ అగ్రిమెంట్ పై సంతకాలు చేయబోతున్నాయని రాయబార కార్యాలయం కన్ఫాం చేసింది. సగటున జర్మనీలో భారతీయులకు నెలవారీ జీతం 5,400 యూరోలుగా ఉంది. అంటే... సుమారు రూ.5 లక్షలన్నమాట!
కాగా... ఫెడరల్ లేబర్ మినిస్ట్రీ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జర్మనీలో సుమారు 1.37 లక్షల మంది భారతీయులు స్కిల్ జాబుల్లో పనిచేస్తున్నరని తెలిపింది. 2015లో ఈ సంఖ్య 23,000గా మాత్రమే ఉందని వెల్లడించింది. ఈ సమయంలో... నైపుణ్యం కలిగిన భరతీయుల వలసలను ప్రోత్సహించేందుకు ఇంటిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయనుందని అంటున్నారు.