Begin typing your search above and press return to search.

తోటి స్టూడెంట్స్ ప్రైవేట్ పిక్స్ సీనియర్ కి పంపించింది... ఇష్యూ వైరల్!

ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలోని ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:12 AM GMT
తోటి స్టూడెంట్స్ ప్రైవేట్ పిక్స్ సీనియర్ కి పంపించింది... ఇష్యూ వైరల్!
X

ఈ మధ్యకాలంలో అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలను రహస్యంగా బంధించడం.. అనంతరం బ్లాక్ మెయిల్ చేయడం వంటి ఘటనలు నిత్యం ఏదో ఒక మూల జరుగుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యూపీలో అలంటి ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలోని ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థిని ఆమె హాస్టల్‌ లోని తోటి అమ్మాయిల అభ్యంతరకర ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీయడం ప్రారంభించింది. అనంతరం వాటిని తన సీనియర్ విద్యార్థి కి పంపించేది. ఈ సమయలో అతడు ఆ ఫోటోలు, వీడియోలను బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించాడు.

వివరాళ్లోకి వెళ్తే... బాధితులు కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థిను ప్రైవేట్ హాస్టళ్లలో నివసిస్తున్నారు. ఈ సమయంలో నిందితురాలు తోటి అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తన సీనియర్ కి పంపించడం మొదలుపెట్టింది. అతడు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

ఓ రోజు నిందితులు తమ క్లాస్ ఫ్రెండ్స్‌ కు ఈ విషయాన్ని వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం దావానలంలా వ్యాపించడంతో కొద్దిసేపటికే కాలేజ్ మొత్తం మాట్లాడుకుంది. ఈ విషయం బాధితులకు కూడా తెలిసింది. ఈ ఘటనతో కాలేజీలోని విద్యార్థినులంతా తమ భద్రతపై ఆందోళన చెంది కళాశాల యాజమాన్యాన్ని ఆశ్రయించారు.

దీంతో బాధితులు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కళాశాల అడ్మినిస్ట్రేషన్‌ ను ఆశ్రయించారు. దీంతో కళాశాల అధికారులు విచారణ చేపట్టి ఆరోపణలు నిజమేనని తేల్చారు. ఈ ఘటనపై కళాశాల ఇన్‌ ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బీఎన్‌ సాహ్ని స్పందించారు. విషయం తీవ్రత దృష్ట్యా కళాశాల అంతర్గత విచారణ జరిపి నిందితులిద్దరిపై వచ్చిన ఆరోపణలను గుర్తించిందని తెలిపారు!

అనంతరం పోలీసులను క్యాంపస్‌ కు పిలిపించి, నిందితులు తమ మొబైల్ ఫోన్‌ లలోని అభ్యంతరకర చిత్రాలు, వీడియోలను పోలీసుల ఎదుట తొలగించేలా చేశారని అంటున్నారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిందితులను 6 నెలల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు.