Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీ సిబ్బందిని దారుణంగా కొట్టారు... వీడియో వైరల్!

దీంతో... రాజేంద్రనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగించాలని ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందికి సూచించారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   30 March 2024 5:33 AM GMT
జీహెచ్ఎంసీ సిబ్బందిని దారుణంగా కొట్టారు...  వీడియో వైరల్!
X

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిబ్బందిపై వీధి వ్యాపారులు దాడి చేశారు! రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి!

హైదరాబాద్ నగర శివార్లలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలో ప్రధాన రహదారి మీద పిల్లర్ నెంబర్ 207 వద్ద ఫుట్ పాత్ పై అక్రమంగా కొందరు వ్యాపారం చేస్తున్నారని, వాటిని తొలగించాలని, వాటివల్ల ట్రాఫిక్ కి ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కి ఆన్ లైన్ లో పలు ఫిర్యాదులు అందాయంట.

దీంతో... రాజేంద్రనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగించాలని ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బందికి సూచించారని తెలుస్తుంది. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్మికులు.. ఫుట్ పాత్ పై ఉన్న కొబ్బరి బొండాలను ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో వేయడం మొదలుపెట్టారట. దీంతో... ముగ్గురు వ్యక్తులు వచ్చి.. మున్సిపల్ సిబ్బందిపై రాళ్లతోనూ, కర్రలతోనూ, కొబ్బరి బోండాలతోనూ దాడి చేసినట్లు కనిపిస్తుంది!

ఈ సమయంలో తమపై దాడి చెయ్యొదంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంతగా బ్రతిమలాడినా వారు వినలేదని తెలుస్తుంది. దీంతో ఈ విషయంపై మున్సిపల్ సిబ్బంది స్థానిక అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు!

ఈ సమయంలో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారని తెలుస్తుంది. మరోపక్క ఈ దాడిలో గాయపడిన మున్సిపల్ సిబ్బందిని ఆస్పత్రికి తరలించారని సమాచారం. వీరిని రాజేంద్రనగర్ డిప్యూటీ కమీషనర్ పరామర్శించారని అంటున్నారు!