Begin typing your search above and press return to search.

విరాళం వేళ చిరంజీవి కోసం ఆ పార్టీ క్లెయిం !

మెగాస్టార్ చిరంజీవి రాజకీయలను పక్కన పెట్టి తన సినిమాలను తాను చేసుకుంటున్నారు. ఆయన రాజకీయం అంటే నో చెప్పేస్తుంటారు

By:  Tupaki Desk   |   9 April 2024 2:30 PM GMT
విరాళం వేళ చిరంజీవి కోసం ఆ పార్టీ క్లెయిం !
X

మెగాస్టార్ చిరంజీవి రాజకీయలను పక్కన పెట్టి తన సినిమాలను తాను చేసుకుంటున్నారు. ఆయన రాజకీయం అంటే నో చెప్పేస్తుంటారు. ఎన్నో ఇంటర్వ్యూలలో సైతం చిరంజీవిని మీడియా రాజకీయాల మీద ప్రశ్నించినపుడు ఒక దండం పెట్టి ఊరుకున్నారు

అలాంటి చిరంజీవి సడెన్ గా మళ్లీ రాజకీయ కలకలం సృష్టించారు. ఆయన తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. ఏకంగా తాను షూటింగ్ చేస్తున్న లోకేషన్ కి పిలిపించుకుని మరీ చిరంజీవి ఈ విరాళాన్ని ఇవ్వడం చర్చకు తెర లేపెలా చేసింది.

నిజానికి చిరంజీవి విరాళం ఇవ్వాలనుకుంటే చాలా సైలెంట్ ఇచ్చేయవచ్చు. దాన్ని ఒక ఈవెంట్ గా ఆయన చేయడంతో ఆయన రాజకీయ పున ప్రవేశం మీద అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. జనసేనకి మెగాభిమానులను దగ్గర చేయడానికి మెగా కాంపౌండ్ ని పవన్ కి అండగా ఉంచడానికి ప్రజలకు తాను తమ్ముడి వైపే ఉన్నాను అన్న సంకేతాన్ని ఇవ్వడానికే చిరంజీవి అలా చేశారు అని అంటున్నారు

అయితే చిరంజీవి జనసేన తరఫున ప్రచారానికి వస్తారా రారా అంటే దాని మీద కూడా హీటెక్కించే లెవెల్ లో చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా సరిగ్గా నెల రోజుల టైం ఉంది. ఈ లోగా ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. మొత్తానికి మెగాస్టార్ జనసేనకు దగ్గర అయ్యారని అంతా అంటున్నారు.

సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ హర్ట్ అవుతోంది. చిరంజీవి ఇప్పటికీ మా పార్టీ వారే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీని మీద ఏ పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ వాడే అని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయలేదని ఒక లాజిక్ పాయింట్ ని కూడా బయటకు తీశారు. అంతే కాదు ఏఐసీసీ సభ్యులుగా చిరంజీవి కొనసాగుతున్నారని సరికొత్త విషయం కూడా చెప్పారు.

అంటే చిరంజీవి పక్కా కాంగ్రెస్ నేత అని గిడుగు రుద్రరాజు చెబుతున్నారు అన్న మాట. ఆయన సీడబ్ల్యూసీలో మెంబర్ గా ఉంటున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న గిడుగు రుద్రరాజు మాటలను అంత తేలిగ్గా ఎవరూ తీసుకోలేరు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే మెగాస్టార్ కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్లుగా ఎక్కడా లేదు. దాంతో ఆయన ఈ రోజుకీ కాంగ్రెస్ నేతగానే ఆ పార్టీ క్లెయిం చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఇక గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, కేవలం తమ్ముడు అనే కారణంతోనే పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి అయిదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్ధిక సహాయం చేసి ఉంటారని అన్నారు. ఈ విషయం మీద కొందరు చిరంజీవి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. మొత్తం మీద చూస్తే గిడుగు రుద్రరాజు చిరంజీవిని కాంగ్రెస్ మనిషిగా చెబుతున్నారు. గతంలో కూడా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ లాంటి వారు చిరంజీవిని కాంగ్రెస్ వారే అని చెబుతూ వచ్చారు.

చిరంజీవి కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ ప్లే చేయాలని ఆయనను సీఎం గా చేస్తామని కూడా చింతా మోహన్ అనడమూ జరిగింది. దాని కంటే ముందు జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా చిరంజీవికి పార్టీ ఓటేసేందుకు మెంబర్ గా అవకాశం ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఓటు కాంగ్రెస్ చూపించింది. అయినా చిరంజీవి ఓటు వేసినట్లుగా కనిపించలేదు. ఆయనను మావారే అని కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నా చిరంజీవి నుంచి మౌనమే సమాధానం అవుతోంది. మొత్తానికి చిరంజీవికి రాజకీయాల మీద ఆసక్తి ఉందా ఉంటే ఆయన జనసేనలోకి వస్తారా కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్నది మాత్రం తేలాల్సిన అంశంగానే ఉంది.