Begin typing your search above and press return to search.

ఇప్పటి మెలోని కాదు.. పాత వీడియోలో ఆమెను చూస్తే అవాక్కే

హుషారుగా ఉండే ఆమె తీరు పలువురు ముచ్చట పడేలా చేయటమే కాదు.. ఆమెను భారతీయులకు మరింత దగ్గర చేసింది

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:28 AM GMT
ఇప్పటి మెలోని కాదు.. పాత వీడియోలో ఆమెను చూస్తే అవాక్కే
X

ఇటలీ దేశ చరిత్రలో మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జార్జియా మెలోని గురించి ప్రత్యేకంగా రిచయం చేయాల్సిన అవసరం లేదు. 47 ఏళ్ల వయసున్న ఆమె ఇటలీ వేదికగా నిర్వహించిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సుతో భారతీయులకు మరింత చేరువయ్యారు. ఈ సదస్సుకు హాజరైన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి నమస్తే చెబుతూ.. సాదరంగా ఆహ్వానించటమే కాదు.. మోడీతో ఆమె దిగిన సెల్ఫీ ఫోటో.. వీడియో వైరల్ గా మారటం తెలిసిందే. హుషారుగా ఉండే ఆమె తీరు పలువురు ముచ్చట పడేలా చేయటమే కాదు.. ఆమెను భారతీయులకు మరింత దగ్గర చేసింది.

1992లో తన పొలిటికల్ కెరీర్ షురూ చేసిన ఆమె.. కాలక్రమంలో పలు బాద్యతలు చేపట్టి.. చివరకు దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు చెందిన పాత వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇప్పుడైతే నవ్వుతూ.. కూల్ గా ఉన్న ఆమె.. గతంలో మాత్రం సీరియస్ గా ఉండటం కనిపిస్తుంది. పలు సందర్భాల్లో తీసిన వీడియోల్లో ఆమె సీరియస్ గా ఉండే వాటిని చూస్తున్న ఆమెను.. లేడీ గ్యాంగస్టర్ లుక్ లో ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కొన్నింటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఆమె పాల్గొన్న పలు సమావేశాలు.. ర్యాలీల్లో ఆమె లెదర్ జాకెట్ ధరించి.. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ.. లేడీ గ్యాంగ్ స్టర్ ను తలపించేలా ఆమె లుక్ ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఆమె ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెర తీశారు. ఇప్పటివరకు ఆ దేశంలో ప్రధానిని ఎన్నుకునే విధానంలోనూ మార్పు తెచ్చారు. ఇటీవల సెనెట్ ఆమోదం పొందిన దాని ప్రకారం.. ఇకపై ఇటలీ ప్రధానమంత్రిని ప్రజలు నేరుగా ఎన్నుకోగలుగుతారు. గెలిచిన అభ్యర్థికి ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. గెలిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే కూటమికి కనీసం 55శాతం సీట్లు ఇచ్చేలా చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని.. అన్ని సంస్కరణలకు తల్లిగా అభివర్ణిస్తున్నారు.

గత ఏడాది భర్తతో విడిపోయిన ఆమె ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్ గా ఉంటున్న ఆమె.. ఇటలీలోని మితవాద పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. తన పదిహేనేళ్ల వయసులోనే యూత్ ఫ్రంట్ ను ప్రారంభించిన మెలోని.. రాజకీయాల ద్వారా బెర్లుస్కోనీ ఆధ్వర్యంలో యువజన మంత్రిగా ఎదిగారు. తన పదవీకాలంలో కఠినమైన వలస నియంత్రణలను తీసుకురావటంతో పాటు.. పన్ను విధానాల్లోనూ కీలక మార్పులకు తెర తీశారు. మొత్తంగా ఇప్పుడు నవ్వుతూ.. హుషారుగా కనిపించే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గతంలో మాత్రం డిఫరెంట్ లుక్ లో ఉన్న ఆమె చిట్టి వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.