Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిచ్చిన ఒడిషా బీఆరెస్స్ చీఫ్!

ఇందులో భాగంగా ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ తన అనుచరులతో కలిసి రాజీనామలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 12:43 PM GMT
కేసీఆర్  కు షాకిచ్చిన ఒడిషా బీఆరెస్స్  చీఫ్!
X

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్స్) ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆరెస్స్) గా మార్చిన సంగతి తెలిసిందే. అనంతరం మహారాష్ట్రలో ఫుల్ ఫోకస్ పెట్టి వరుస మీటింగులు పెడుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే కేసీఆర్ కు షాకిచ్చారు ఒడిషా బీఆరెస్స్ చీఫ్!

అవును... ఇంకా పూర్తిస్థాయిలో చేరికలు సెట్ అయ్యాయో లేదో తెలియదు కానీ... అప్పుడే జంపింగులు స్టార్ట్ అయిపోయాయి. ఇందులో భాగంగా ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ తన అనుచరులతో కలిసి రాజీనామలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఇలా ఒడిషా బీఆరెస్స్ కు రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరికపై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. అనంతరం రాహుల్ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం.

గతంలో ఒడిషాలో పార్టీ విస్తీర్ణానికి స్కోప్ ఉందని కేసీఆర్ భావించారని అంటారు. దీంతో... ఒడిషాలో పార్టీ విస్తరణ కోసం మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కుటుంబాన్ని ఒప్పించారు. ఇందులో భాగంగా జనవరిలో ఒడిషా నుంచి ప్రత్యేక విమానాల్లో వారందర్ని హైదరాబాద్‌ కు పిలిపించి గులాబీ కండువాలు కప్పారు. ఆ సమయంలో గమాంగ్ ని కేసీఆర్ బీఆరెస్స్ ఒడిషా చీఫ్ గా నియమించారు.

కాగా... గిరిధర్ గమాంగ్ బీజేపీ నుంచి బీఆరెస్స్ లోకి వచ్చి చేరినప్పటికీ... ఆయన సంప్రదాయంగా కాంగ్రెస్ కు చెందిననేత. ఎంపీగా గిరిధర్ గమాంగ్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడా నిరాదరణ ఎదురుకావడంతో బీఆరెస్స్ లో చేరారు.

ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయనే చర్చ జాతీయస్థాయిలో మొదలైందని అంటున్న సంగతి తెలిసిందే. దీంతో కారు దిగిన గమాంగ్... మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు.